ప్రతి ఒక్కరి ఇంట్లో సుగంధ ద్రవ్యాలు ( Spices )� ఉంటాయి. వీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. అలాంటి ఒక సుగంధ ద్రవ్యమే లవంగం ( cloves ) .� దీనిని ఆయుర్వేదంలో బాగా వాడుతుంటారు.
ఈ లవంగం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది కూరల్లో ఇవి తీసేసి తింటారు. కానీ, వీటిని తినడం వలన వైరల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే, లవంగాల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణ సమస్యల నుంచి ఉపశమనానికి
ఎన్నో ఏళ్ళుగా లవంగాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక లవంగం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, లవంగాలను తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా గొంతు మంట , గొంతు నొప్పి కారణంగా ఎవరైనా బాధపడితే వారు వీటిని రోజూ తినడం వలన ఉదయానికి రిలీఫ్ పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నిద్ర మెరుగుపడుతుంది
లవంగాలను ( cloves ) రాత్రి పూట తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణ జరగడంతో పాటు నిద్ర కూడా మంచిగా పడుతుంది. దీంతో, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి రాత్రుళ్ళు రెండు లవంగాలు వేసుకొని పడుకోవడం నిద్ర లేమి సమస్య నుంచి బయటపడతారని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.