Health Benefits of Finger Millets: పూర్వకాలంలో ఏది తిన్నా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బాగా పనిచేసేవి. కానీ ఇప్పుడు ఏది తిన్నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి. ఒకప్పుడు రాగిసంకటి, రాగి జావ, జొన్న గడక, అంబలి, చద్దన్నం వంటివి చేసుకుని తిని మన పెద్దలు ఎక్కువ కాలం పాటు బతికేశారు. ఇప్పుడు కూడా వారు ఇవే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే వీటిలో ఏముంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఆరోగ్యానికి ఇవి సంజీవని లాంటివి. వీటిని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా భయంతో పారిపోవాల్సిందే మరి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే రాగులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
రాగులు శరీర ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగి పిండితో తయారుచేసే రాగి జావా, దోషలు, రాగి సంకటి వంటివి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా శరీర బరువును తగ్గించుకునేందుకు రాగులు చాలా బాగా ఉపయోగపడతాయట. రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తరచూ ఫిట్‌గా ఉండాలనుకునే వారు తరచూ రాగి జావ తాగితే మేలు. ఇక గుండె సమస్యలు ఉన్నవారికి కూడా రాగి జావలో ఉండే మెగ్నీషియం, పొటాషియంలు ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతాయి. కాలేయంలో కొవ్వు పేరుకోకుండా రాగుల్లో ఉండే పోషకాలు సహాయపడతాయి. దీనికి ఫలితంగా గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
డయాబెటీస్..
రాగుల జావ లేదా రాగి దోష వంటివి తరచూ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. రాగుల్లో ఉండే అధిక ఫైబర్ రక్తంలోని చెక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ..
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండడం మూలంగా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం, అరుగుదల వంటి అనేక సమస్యలను రాగులు నయం చేస్తాయి. అంతేకాదు ఎముకల బలానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. రాగి జావను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల్లో బలం పెరుగుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా ఉపయోగపడతాయి.