ఒకప్పుడు మనుషులు చాలా దృఢంగా ఉండేవారని.. ఎవరికీ బీపీ, షుగర్, గుండె జబ్బులు పెద్దగా వచ్చేవి కావని పెద్దలు చెపుతుంటారు. అయితే ఈ రోజుల్లో అనారోగ్యమైన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు.
కొంతమంది ఎప్పుడూ నీరసంగా ఉంటూ, ఫిజికల్ వీక్‌నెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల ఎప్పుడూ అలసటగా అనిపించడం, రోజంతా శక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ పనీ సక్రమంగా చేసుకోలేనంత బలహీనంగా మారుతారు. అయితే ఈ సమస్యకు ఒక నేచురల్ రెమిడీతో చెక్ పెట్టవచ్చు. ఒక పదార్థం తింటే 60 ఏళ్ల ముసలి వాళ్లు కూడా 30 ఏళ్ల వ్యక్తిలా ఎనర్జిటిక్‌గా మారుతారు. అదేంటో చూద్దాం.
శారీరక బలహీనతతో బాధపడుతున్న వారికి గోండ్ కటిర (Gond Katira) చక్కని పరిష్కారం. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఎముకలను బలపరచడంతో పాటు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడే వారికి ఇది మంచి ఫలితాలు అందిస్తుంది. గోండ్ కటిర తింటే నిద్ర చక్కగా పడుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభిస్తుంది. పట్టణాల్లో స్థానిక మార్కెట్లు లేదా ఆయుర్వేద మెడిసిన్ షాప్స్‌లో కూడా దొరుకుతుంది.
గోండ్ కటిర అనేది గమ్‌లా కనిపించే ఒక నేచురల్ కాంపౌండ్. ఇది లోకోవీడ్ అనే ఒక రకమైన మొక్క నుంచి వస్తుంది. చూసేందుకు ఎల్లో కలర్‌లో పటిక బెల్లంలాగా ఉంటుంది. అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో గోండ్ కటిరను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లో చలువ చేసే గుణాలు ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు గోండ్ కటిర జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీ శరీరంలోని నీటి శాతాన్ని పెంచి, అధిక చెమటను తగ్గిస్తుంది. సమ్మర్ డ్రింక్స్‌లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. వృద్ధాప్య ఛాయలు, ముఖంపై మచ్చలు, డల్ స్కిన్ ఇతర సమస్యలను తగ్గించగలదు. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
గోండ్ కటిరను రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. దీంతో ఇది తెల్లటి జెల్లీలా మారుతుంది. దీన్ని నిమ్మరసం, చక్కెర, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు, పుదీనా వంటి వాటిలో కలుపుకొని తినొచ్చు. నానబెట్టిన గోండ్ కటిరను ఫ్రెష్ వెజిటేబుల్ సలాడ్స్‌లో మిక్స్ చేసుకొని తినొచ్చు. ఈ జెల్లీని ఫేస్ మాస్క్‌లా వాడొచ్చు. రోజూ గోండ్ కటిర తింటే ఫిజికల్ వీక్‌నెస్ తగ్గుతుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇది నేచురల్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తూ మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే దీన్ని వాడేముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది.