ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఈవీ స్కూటర్ల వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఎక్కువ సంఖ్యలో ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ఈవీ స్కూటర్లనులాంచ్ చేస్తున్నాయి. తాజాగా హీరో కంపెనీ మరో ఈవీ స్కూటర్‌ను మార్కెట్లో రిలీజ్ చేయనుంది.
హీరో మోటోకార్ప్ తాజాగా విడా సిరీస్‌ను అప్డేట్ చేస్తూ వీఎక్స్-2 పేరుతో త్వరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూలై 1న విడా శ్రేణిలోని కొత్త ఈవీను లాంచ్ చేయనుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కూటర్లోని కొన్ని భాగాలను టీజ్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ కొత్త వీఎక్స్2 మోడల్‌ను ఇప్పటికే ఉన్న వీ2 లైనప్‌తో పోలిస్తే సరికొత్త డిజైన్‌తో వస్తుంది. రిలీజ్‌కు ముందు ముందు విడా వీఎక్స్2 ఈవీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.
తాజాగా లీక్ అయిన చిత్రాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వీ2 వెర్షన్‌కు సమానమైన డిజైన్‌తో వస్తుంది. అలాగే హెడ్‌లైట్, టెయిల్ లాంప్లలో కూడా పెద్దగా తేడాలు లేవు. అంతేకాకుండా ఈ ఈవీ వీ2 సిరీస్‌ను గుర్తుకు తెచ్చే ఫోల్డెడ్ బాడీతో వస్తుంది. విడా వీక్స్2 యూనిట్ టీఎఫ్టీ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. అయితే వీ2 వెర్షన్లో కనిపించే వాటితో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. అదనంగా స్క్రీన్‌పై ప్రదర్శించే ఎంపికల ద్వారా నావిగేట్ చేయడానికి భౌతిక బటన్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనంలోని స్విచ్‌గేర్ కూడా వీ2 నుంచి ప్రేరణగా తీసుకుని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ యూనిట్లో కీహోల్ కూడా ఉంది.
వివిధ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విడా వీఎక్స్2 విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వివరణాత్మక సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దాని స్పెసిఫికేషన్లకు అదనంగా బడ్జెట్-స్నేహపూర్వక వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్మించబడుతుందని భావిస్తున్నారు. రాబోయే మోడల్ ధర ఇంకా ప్రకటించకపోయినా దీని ధర రూ. 74,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 1,20,300 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.
































