ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలోగా ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మార్కెట్లోకి హీరో విడా వీ2 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ను అత్యంత తక్కువ డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ డౌన్ పేమెంట్..
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి హీరో విడా వీ2 బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ స్కూటర్ ను కేవలం రూ. 9 వేల డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత నెలకు రూ. 2596 ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుంది.
బడ్జెట్ స్కూటర్
ఓలా, బజాజ్ వంటి బ్రాండ్లకు ఈ స్కూటర్ మంచి పోటీనిస్తోంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 165 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వడం విశేషం. ఇక హీరో విడా వీ2 ఎక్స్ షోరూమ్ ధర రూ. 96,000గా ఉంది. రూ. 9 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే మిగతా మొత్తానికి 9.7 శాతం వడ్డీతో లోన్ లభిస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 kW పవర్ మోటార్, 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు. ఈ స్కూటీని ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా 165 కి.మీలు దూసుకొళ్లొచ్చు.
ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లతో దీన్ని డిజైన్ చేశారు. స్మార్ట్ డిజిటల్ డిస్ప్లే, మల్టీ రైడింగ్ మోడ్స్ తో అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
వి2 ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ స్కూటర్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో లైట్ వేరియంట్ ధర రూ. 96,000, ప్లస్ వేరియంట్ ధర రూ. 1,15,00 కాగా ప్రో వేరియంట్ ధర రూ. 1,35,000గా ఉంది. తక్కువ డౌన్ పేమెంట్ తో సులభమైన ఈఎమ్ఐలతో ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు.