ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..

www.mannamweb.com


మీ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటున్నారా?..ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటో లేదా ఏదైనా ఇతర సమాచారాన్ని అప్ డేట్ చేయడానికి కొంత చెల్లించాల్సి ఉంటుంది.

డెమోగ్రాఫిక్ అప్డేట్ , బయోమెట్రిక్ అప్డేట్ ప్రకారం ఫీజు ఉంటుంది.

ఆధార్ ఆప్డేట్ ఛార్జీలు

వేలిముద్రల మార్పు లేదా కంటి స్కాన్కోసం రూ. 100 ఛార్జీలు వసూలు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. మీరు రెండింటినీ మార్చాలనుకుంటే రెండు రకాల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లి రూ. 30 చెల్లించడం ద్వారా వారి ఈ-ఆధార్ కార్డు ప్రింటెడ్ వెర్షన్ను పొందవచ్చు. మొదటిసారి ఆధార్కోసం నమోదు చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు వర్తంచవు. అంతేకాకుండా ఐదు నుంచి పది హేను సంవత్సరా మధ్య వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం ఉచితం.

అయితే ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే పూర్తిగా ఉచితం. అప్డేట్ చేయాల్సిన సమాచారాన్ని ధృవీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఇంతకుముందు ఉచిత ఆధార్ కార్డు పునరుద్దరణకు మార్చి 14 వరకు గడువు ఉంది. కానీ ఇప్పుడు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని UIDAI జూన్ 14, 2024 వరకు పొడిగింది.

కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని UIDAI సూచిస్తుంది.