అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో కేవలం 100 రూపాయలకే బంగారాన్ని ఎలా కొనవచ్చో తెలుసుకోండి!
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం శుభకరమైనదిగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. కానీ, ఈ సంవత్సరం బంగారం ధర గత ఏడాది కంటే 30 వేల రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఒక తులం బంగారం 1 లక్ష రూపాయల సమీపంలో ఉంది. అయితే, ఇప్పుడు మీరు కేవలం 100 రూపాయలతో కూడా బంగారం కొనుగోలు చేయొచ్చు. ఎలా అంటే?
డిజిటల్ గోల్డ్ ద్వారా అతితక్కువ ధరకు బంగారం కొనడం
ఈ రోజుల్లో PhonePe, Paytm, Google Pay వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు డిజిటల్ గోల్డ్ కొనుగోలు సేవలను అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా మీరు 1 రూపాయి నుండి బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల:
-
మీకు నచ్చిన సమయంలో డబ్బు పెట్టి, బంగారం సేవ్ చేసుకోవచ్చు.
-
కావలసినప్పుడు ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకోవచ్చు.
-
లేదా, మార్కెట్ ధరకు డిజిటల్ బంగారాన్ని విక్రయించి డబ్బు పొందవచ్చు.
-
డిజిటల్ బంగారం సురక్షితంగా ఉంటుంది, దొంగతనం నుండి భద్రంగా ఉంటుంది.
కాబట్టి, ఈ అక్షయ తృతీయ రోజు మీరు చిన్న మొత్తంతో కూడా బంగారం కొనుగోలు చేసి శుభప్రదమైన ఈ దినాన్ని ఆచరించవచ్చు!
































