Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్. బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!

www.mannamweb.com


Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్. బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!

T20 World Cup :పురుషుల టీ20 ప్రపంచ కప్‌ 2024 సాధించిన టీమిండియా (Team India) ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ కి తిరిగి పయనమవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జట్టు అక్కడే ఆగిపోయింది.

అట్లాంటిక్‌ సముద్రంలో ఏర్పడిన ‘హరికేన్ బెరిల్’ (Hurricane Beryl) తీవ్రం ప్రభావం బార్బడోస్‌పై తీవ్రంగా పడింది. దాంతో అక్కడ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

దీంతో బ్రిడ్జ్‌టౌన్‌లోని ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం విమాన సర్వీసులు (Air Services) అన్నింటినీ అక్కడి అధికారులు రద్దు చేశారు. నిజానికి బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి.. అక్కడి నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబై కి రావాల్సి ఉంది. కానీ ‘హారికేన్ బెరిల్’ ప్రభావంతో ప్రయాణం వాయిదా పడిందని సమాచారం. తుఫాన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న టీమిండియా ఆటగాళ్లు కనీస సౌకర్యాలు లేక చాలా తిప్పలు పడుతున్నారు. వారు భోజనం చేయడానికి కూడా సరైన సదుపాయాలు లేక క్యూ లైన్లలో నిల్చుని పేపర్‌ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు.

కాగా ప్రయాణం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఏర్పాట్లను బీసీసీఐ (BCCI) సెక్రటరీ జై షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలుపుకొని మొత్తం 70 మంది బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అమెరికా నుంచి భారీ చార్టెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి నేరుగా బ్రిడ్జ్‌టౌన్ నుంచి ఢిల్లీకి తీసుకునిరావాలని బీసీసీఐ భావిస్తోంది. జులై 2న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటగాళ్లు చేరుకునే అవకాశం ఉంది.

టీ 20 ప్రపంచ కప్‌ ను టీమిండియా జట్టు ముద్దాడిన నేపథ్యంలో వారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించే అవకాశాలు ఉన్నాయి.