Sleeping: సరిగ్గా నిద్రపోకపోతే మీ ఆరోగ్యం షెడ్డుకే

ఇండియాకు నిద్ర పట్టట్లేదు. కంటి నిండా కునుకు లేదు. దేశం నిదరోవట్లేదు. దేశమంటే మనుషులే కదా! ఇప్పుడు దేశంలో చాలామంది నిద్ర లేమితో బాధ పడుతున్నారు. కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో అంటూ బాధ పడుతున్నారు. దేశంలో స్లీప్‌ డిజార్డర్‌తో ఎంతమంది బాధ పడుతున్నారో చూద్దాం. అసలు రోజుకు ఎంతసేపు నిద్రపోవాలో చూద్దాం.


ఇదేదో ఆషామాషీగా చెప్పింది కాదు. దేశంలోని 348 జిల్లాల్లో 43వేల మందితో సర్వే చేసి చెప్పారు నిపుణులు. అయితే ఏ కారణం వల్ల ఎక్కువగా స్లీప్‌ డిస్ట్రబ్‌ అవుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అదేపనిగా బాత్రూమ్‌కి వెళ్లడమే నిద్రకు పెద్ద డిస్ట్రబెన్స్‌గా 72 శాతం మంది చెబుతున్నారు.

ఇక స్లీప్ షెడ్యూల్‌లో తేడా వల్ల నిద్రాభంగం అంటున్నారు 25 శాతంమంది. ఇక దోమలు, బయటి శబ్దాలు కారణం అని కొందరు, మెడికల్ కండిషన్స్‌ అని కొందరు చెబుతున్నారు. ఇంకొంతమంది పిల్లలు, ఇంట్లో సమస్యలు అని వాపోతున్నారు.

మరికొందరు మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోయి అర్ధరాత్రి, అపరాత్రి చాటింగులతో నిద్ర పోవడమే మానేశారు. సరైన నిద్రలేకపోవడంతో ఇండియాలో 47 శాతంమంది ఉద్యోగులు వారంలో ఒక్క రోజైనా లీవ్‌ పెడుతున్నారంటే, నిద్ర లేమి ఎంత పెద్ద సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక నైట్‌ షిఫ్ట్‌ కారణంగా 37 శాతం స్లీప్‌ డిసార్డర్‌తో బాధ పడుతున్నారు. కంటి నిండా కునుకు లేకపోవడంతో చాలామందికి గుండె జబ్బులు, ఊబకాయం, టైప్‌ -2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి.