వాహనదారులకు షాక్.. కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఈ తప్పు చేస్తే రూ.25 వేలు జరిమానా.

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు అతిపెద్ద కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే.


ప్రజలు అతివేగంతో నడపడం, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడటం, హెల్మెట్ ధరించకపోవడం లేదా మద్యం సేవించి వాహనం నడపడం వంటి తప్పులు చేస్తారు. వీటిపై ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ చలాన్ నియమాలు అమల్లోకి వచ్చాయి. వీటిలో చాలా పాత నియమాలు మరింత కఠినతరం అయ్యాయి. ఇప్పుడు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి తప్పు చేయడం వల్ల మీకు భారీగా నష్టం వాటిల్లుతుంది.

తాగి వాహనం నడపడం ఖరీదైనది:

కొత్త నిబంధనల ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మొదటిసారి రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. అదే వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తే జరిమానా రూ.15,000 వరకు ఉండవచ్చు. జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు పెరగవచ్చు.

ఇప్పుడు రెడ్ లైట్ దాటితే రూ. 5000 జరిమానా:

మీరు సిగ్నల్‌ను క్రాస్‌ చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకు మీరు రూ. 5,000 చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ జరిమానా రూ. 500 మాత్రమే.

అతి వేగంగా నడిపితే.. అదనపు లగేజీని తీసుకెళ్తే భారీ జరిమానాలు:

నిర్దేశించిన వేగం కంటే వేగంగా వాహనం నడిపితే రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ట్రక్కు లేదా వాణిజ్య వాహనం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను తీసుకువెళితే రూ.20,000 కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే..

ఇప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మీరు రూ. 5,000 జరిమానా చెల్లించాలి. అయితే మీకు డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో చెల్లుబాటు అయ్యే డీఎల్ ఉన్న సరిపోతుంది.

పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే జరిమానా:

వాహనం నుంచి వచ్చే పొగను నియంత్రించడానికి పియుసి సర్టిఫికేట్ తప్పనిసరి. మీ దగ్గర అది లేకపోతే, మీకు రూ. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. దీనితో పాటు సమాజ సేవను కూడా ఆదేశించవచ్చు.

సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు చలాన్:

ఇప్పుడు డ్రైవర్ మాత్రమే కాదు, కారులోని ప్రయాణికులందరూ సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. ముందు కూర్చున్నా, వెనుక కూర్చున్నా, సీట్ బెల్ట్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించబడుతుంది.

బైక్‌పై ముగ్గురు ప్రయాణించినా జరిమానా:

ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నట్లు తేలితే, వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా..

గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా ఉండేది. ఇప్పుడు దానిని రూ.1,000కి పెంచారు. అలాగే, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా 3 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు.

మైనర్ వాహనం నడిపితే కఠిన శిక్ష:

మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే, అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు రూ.25,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. దీనితో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు రద్దు చేస్తారు. ఆ మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు డ్రైవింగ్ లైసెన్స్ లభించదు.

మొబైల్ వాడకంపై కఠినతరం:

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ఇప్పుడు మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీని వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే దీనికి రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.