నేడున్న గజిబిజి జీవన శైలి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని మర్చిపోయి పరుగులు పెడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
వేగంగా మారుతున్న జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన తక్కువ రోగ నిరోధక శక్తి కారణంగా వెంటనే ఆ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, సమస్య వచ్చినా మొదట్లో చిన్నగానే కనిపిస్తాయి. ఆ చిన్న లక్షణమే పెను ముప్పుగా మారుతుంది.
చాలా సందర్భాల్లో, ఈ లక్షణాలు తొలుత తక్కువగా ఉంటాయి. కానీ మనం అవగాహన లేమితో వాటిని గమనించకపోతే, వ్యాధి తీవ్రత పెరిగి, సమయానికి వైద్య సలహా తీసుకోకపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతీ తరచుగా తమ సోషల్ మీడియాలో ఆరోగ్య సంబంధిత ముఖ్యమైన విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వాటిని ఏమాత్రం విస్మరించకూడదని ఆయన చెబుతుంటారు. ఆ లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అకస్మాత్తుగా ఛాతీలో తీవ్ర నొప్పి
డాక్టర్ సేతీ చెప్పినట్లుగా, అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి మరియు ఆ నొప్పి ఎడమ చేతి వైపు వస్తుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదని వెల్లడించారు. ఆ నొప్పి అలా ఎడమ చేతి వైపు వ్యాపించడం గుండెపోటుకు సంకేతం కావచ్చని తెలిపారు. ఈ రకమైన నొప్పి ఉంటే, అవగాహనతోనే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరమని, తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు.
మాట్లాడటంలో ఇబ్బంది
ఒక వ్యక్తి మాటలలో ఇబ్బంది పడటం లేదా ముఖం వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, ఇది స్ట్రోక్ సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెనకాడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. స్ట్రోక్ ముందుగా వచ్చినప్పుడు ఈ లక్షణాలే కనిపిస్తాయని డాక్టర్ సేథీ వెల్లడించారు. అందుకే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతుంటారు.
మలం లేదా మూత్రంలో రక్తం
డాక్టర్ సేతీ ప్రకారం, మలం లేదా మూత్రంలో రక్తం కనిపించడం శరీరంలో తీవ్రమైన సమస్యల సంకేతం కావచ్చు, ముఖ్యంగా కిడ్నీ లేదా పెద్దపేగు సంబంధిత వ్యాధుల సూచన. దీన్ని తేలికగా తీసుకోకుండా వైద్య సలహా తీసుకోవాలి. అది సాధారణమే అని తేలికగా తీసుకుంటే శరీరంలోని రక్తకణాలు అన్నీ ఆ రక్తం ద్వారా బయటికి వెళ్లి ప్లేట్‌లెట్స్ పడిపోయి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
పొట్టలో తీవ్రమైన నొప్పి
అకస్మాత్తుగా పొట్టలో తట్టుకోలేనంత నొప్పి కలగడం అనేది పిత్తాశయం లేదా కిడ్నీ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ రకమైన నొప్పిని ఉపేక్షించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
అకస్మాత్తుగా బరువు తగ్గడం
ఎలాంటి ప్రయాస లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది శరీరంలో వ్యాధి సంకేతంగా ఉండవచ్చు. ఎలాంటి సర్కారు వయాసములు లేకుండా బరువు తగ్గడం సహజం కాదు, కాబట్టి ఈ లక్షణాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
రక్తంతో కూడిన దగ్గు
సాధారణ జలుబు, దగ్గుతో పాటు నోట్లో రక్తం రావడం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేకపోతే ప్రాణాంతక వ్యాధి సంకేతం కావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.
కళ్లలో మందు, దృష్టి సమస్య
ఒక వ్యక్తి కళ్లలో తార్సు పడి దృష్టి కోల్పోతున్నట్లయితే, అది రెటీనా డిటాచ్ అవ్వడానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మంచి కంటి నిపుణుడి సలహా తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయట పడొచ్చని వెల్లడించారు