ఇటీవలే కాలంలో కోర్టులు అనేక సంచలన తీర్పులు ఇస్తున్నాయి. కొన్ని తీర్పులు అయితే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కుటుంబ విషయాలు, వివాహేతర సంబంధం, శృOగారంకి సంబంధించిన అంశాలపై కోర్టులు అనేక సంచలన, ఆసక్తికరమైన తీర్పులు ఇస్తుంటాయి. ఇప్పటికే వివాహేత సంబంధం పలు కోర్టులు కీలక తీర్పులు ఇచ్చాయి. అలానే వరకట్నం, ఇతర కుటుంబ అంశాలకు సంబంధించి..కూడా పలు హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. తాజాగా ఓ కోర్టులు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. మరి.. ఆ తీర్పు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా లైంగిక సంబంధాలు అనేవి భార్యభర్తల మధ్యే ఉండాలని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అలా కాకుండా ఇతరులతో సంబంధం పెట్టుకుంటే నేరంగా భావిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో అయితే అలా ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. ఆ గ్రామ పెద్దలు శిక్షలు కూడా వేస్తారు. కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టు..వీటన్నిటికి భిన్నంగా తీర్పు ఇచ్చింది. పద్దెనిమిది ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నా, చేసుకోకపోయినా ఇష్టప్రకారం.. ఇల్లీగల్ రిలేషన్ ఉంటే తప్పు లేదని హైకోర్టు తెలిపింది. అంటే కోర్టు ఇచ్చిన తీర్పు చూసినట్లు అయితే వారి వివాహ స్థితితో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య పర్సపర అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిగితే ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేసింది.
ఓ యువతిని వివాహితుడు మోసం చేశాడనే కేసు విచారణలోకి వచ్చింది. ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానే సాకుతో వివాహితుడు మోసం చేశాడనే కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుదీర్ఘ విచారణ చేసిన అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టులు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ఉంటే అది అత్యాచారం లేదా మోసం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. అతను బలవంతపు సంబంధం పెట్టుకున్నట్లు, రే*ప్ చేసినట్లు ధృవీకరించబడలేదు కాబట్టి అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
అంతేకాక నిందితుడి పెళ్లైన విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి సంబంధాన్ని కొనసాగించిందని.. ఇద్దరు ఇష్టపడే చేశారని కోర్టు అభిప్రాయపడింది. ఇక ఈ తీర్పు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్రమ సంబంధం పెట్టుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో సంప్రదాయాలు మంటగలిసిపోతాయని.. ఇష్టారీతిన రెచ్చిపోతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య కల్చర్ మన భారత్లోకి పూర్తిగా వచ్చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.