డయాబెటీస్ ఉన్నవాళ్లు అసలు స్వీటే తినకూడదు..అని చాలామంది చెబుతారు. అది నిజమే. డయాబెటిస్ ఉన్నవాళ్లు పంచదార ఎక్కువగా ఉన్న ఏ స్వీట్లనూ తినకూడదు.
కానీ పంచదార లేని స్వీట్లు తినొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్లకి శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎక్కువ నీరసం వచ్చేస్తుంది. అయితే మళ్లీ శక్తిని కూడగడ్డాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినాలి. అందులో ఒకటి ఈ స్వీట్. అంతేకాదు షుగర్ రావడం వల్ల స్వీట్లకు చాలాకాలం పాటు దూరంగా ఉంటారు. అలాంటి వారు కూడా ఈ స్వీట్ తినొచ్చు. పంచదార లేని ఈ స్వీట్ తింటే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. పైగా ఇది ఎక్కువగా బలాన్ని కూడా ఇస్తుంది. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి? దాని తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
రాగులు, మినపపప్పు హల్వా
షుగర్ పేషెంట్లలోని రక్తం సరఫరా ఒక్కోసారి ఫాస్ట్ గా ఒక్కోసారి స్లో గా ఉంటుంది. కొన్ని సార్లు రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో శరీరమంతా చాలా వీక్ అయిపోతుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. ఎక్కడకి వెళ్లబుద్ది కాదు. ఇలాంటి టైంలో రాగులు, మినపప్పుతో చేసిన హల్వా తింటే ఎక్కడలేనంత హుషారు వస్తుంది.
తయారీ విధానం
ఒక గిన్నెలో నెయ్యి వేసి అందులో ఒక కప్పు రాగులు, ఒక కప్పు నల్లటి మినపప్పును వేసి దోరగా వేపుకోవాలి. మినపపప్పు కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక అరకప్పు నువ్వులు వేయించి , మళ్లీ స్లిమ్ లో పెట్టి వేయించాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మళ్లీ మరొక గిన్నె పెట్టి అందులో తురిమిన బెల్లం, కొన్ని నీళ్లు వేయాలి. నీళ్లలో బెల్లం గడ్డలు కరిగేంతవరకు తిప్పుతు ఉండాలి. పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత అందులో రెండు స్పూన్ల మిక్సీ పట్టుకుని ఉంచిన రాగి, మినపప్పు పొడిని వేసి తిప్పాలి. ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో కాస్త నెయ్యి, కాస్త ఇలాచి పొడి వేసి, ఒక రెండు నిమిషాలు స్టవ్‌పై ఉంచి తీసేయాలి. ఇది లిక్విడ్‌లా ఉంటుంది. అయితే ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్లు చాలా తక్కువ బెల్లంతో ఈ స్వీట్‌ని తయారుచేసుకోవాలి.































