తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన భారత మహిళలు.. చిత్తుగా ఓడిన పాక్..

www.mannamweb.com


India vs Pakistan, Women’s Asia Cup T20 2024: మహిళల ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టును ఓడించి సత్తా చాటింది.

పాక్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ పాక్ జట్టు కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ జట్టును లో స్కోరింగ్‌కే కట్టడి చేయడంలో సఫలం అయ్యారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. పాకిస్థాన్ తరఫున సిద్రా అమీన్ 25, తుబా హసన్, ఫాతిమా సనా తలో 22 పరుగులు చేశారు.

అనంతరం ఛేజింగ్ మొదలు పెట్టిన భారత జట్టు కే వలం 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. షఫాలీ వర్మ 40, మంథాన 45 పరుగులతో రాణించారు. ఈ విజయంతో భారత జట్టు ఖాతాలో 2 పాయింట్లు చేరాయి.

మహిళల టీ20 ఆసియా కప్ జులై 19 నుంచి జులై 28 వరకు జరగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన మహిళా జట్లు ఉన్నాయి.

భారత మహిళల జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, రిచా ఘోష్, డి. హేమలత, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, జెమినీ రోజర్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్.

పాకిస్థాన్ మహిళల జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11

నిదా దార్ (కెప్టెన్), ఇలియా రియాజ్, తుబా హసన్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజ్, ఇరామ్ జావేద్, సిద్రా అమీన్, నస్రా సంధు, సయ్యదా అరుబ్ షా, మునిబా అలీ, సాదియా ఇక్బాల్.