Infinix Note 40 Pro: బడ్జెట్‌ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌

www.mannamweb.com


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో, ప్రో+ పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను కంపెనీ బడ్జెట్ రేంజ్‌లోనే లాంచ్‌ చేసింది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 6ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలోనే అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరా అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో దుమ్ము, ధూళి నుంచి ప్రొటెక్షన్‌ కోసం ఐపీ53 రేటింగ్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ పొందొచ్చు