రూ. 12,000 ధరలో సూపర్ ఫీచర్స్ తో Infinix Note 50x 5G ఫోన్ ను లాంచ్

Infinix Note 50x 5G స్మార్ట్ ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో కేవలం రూ. 12,000 కంటే తక్కువ ధరలో లాంచ్ చేయనున్నట్లు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, కీలకమైన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ ప్రైస్ ను కూడా ఇన్ఫినిక్స్ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ టీజర్ వివరాలు మరియు ప్రైస్ డిటైల్స్ చూసిన తర్వాత ఈ ఫోన్ చాలా చవక ధరలో సూపర్ ఫీచర్స్ తో లాంచ్ కాబోతున్నట్లు అర్థం అవుతోంది.


Infinix Note 50x 5G : లాంచ్ డేట్
ఈ ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన వివరాలు మరియు ప్రైస్ వివరాలు కూడా అందించింది.

Infinix Note 50x 5G : ప్రైస్
ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ను రూ. 12,000 కంటే తక్కువ ధరలో లాంచ్ చేయనున్నట్లు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఆఫర్స్ కలిపి ఉంటుందా లేక ఇదే ఆఫర్ ప్రైస్ లో లాంచ్ అవుతుందా అని మాత్రం క్లియర్ చేయలేదు. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు IP64 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ 5G చిప్ సెట్ Dimensity 7300 తో పని చేస్తుంది మరియు జతగా Infinix AI సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లేని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి.

ఈ స్మార్ట్ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP అల్ట్రా క్లియర్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు బాక్స్ లో 45W ఛార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ వైర్డ్ రివర్స్ ఛార్జ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.