నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు.
మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.
ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.