మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కారణం ఏదైనా. పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని, వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారని తెలిసిందే. సాధారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ప్రారంభిస్తే, గుండె జబ్బులు, రక్తంలో చక్కెర పెరగడం, స్ట్రోక్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల డ్రింక్స్‌ను తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పొట్టు చుట్టూ కొవ్వును తగ్గించడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల జిలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. అనంతరం ఉదయం లేవగానే ఈ నీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇందులో నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చు. రెండు వారాల పాటు ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే పొట్ట కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.
* బరువు పెరగకుండా ఉండేందుకు అల్లం నీరు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక అంగుళం అల్లం ముక్కను వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.
* దాల్చిన చెక్క నీరు కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో దాల్చిన చెక్కపొడిని వేయాలి. అలా మరిగించిన నీటిని ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.