ఇంటి గుట్టు లంకకు చేటు అని ఒక పురాణ సామెత ఉంది. అది నిజంగా చేయాల్సినంత డ్యామేజి చేసింది. అలాగే గుట్టు తెలిసిన వారు సడెన్ గా ప్రత్యర్ధులు అయితే అంతకంటే బిగ్ ట్రబుల్ వేరేగా ఉండదు.
నిజానికి చూస్తే రాజకీయాల్లో అటు వారు ఇటూ ఇటు వారు అటూ వెళ్ళడం సర్వ సాధారణం. అయితే వివిధ హోదాలలో పనిచేసిన వారు వెళ్ళడం వేరు పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు పట్టుకొమ్మలుగా ఉన్న వారు పార్టీని వీడిపోవడం అంటే అది నిజంగా ఎంతో చేటు తెస్తుంది.
ఏ పార్టీలో చూసుకున్నా మూలవిరాట్టులు ఎపుడూ పార్టీ గడప దాటరు. వారిని అలా దాటకుండా కూడా పెద్దలు చూసుకుంటారు. వైసీపీలో చూస్తే ఆ రకమైన మెకానిజం లేదని అంటున్నారు. ఎంతటి పెద్ద వారు అయినా వెళ్ళిపోతే లైట్ తీసుకుంటారనే అంటున్నారు. అయితే అలా మూలాలు తెలిసిన వారు వెళ్తే అసలుకే ఎసరు అన్నది ఎన్నో అనుభవాలు రాజకీయంగా చరిత్రలో ఉన్నాయి.
ఇపుడు వైసీపీలో చూస్తే ఆరు నూరు అయినా తమదే పార్టీ అని వైసీపీలో ఉన్న వారు ఎప్పటికీ ఉండాల్సిన వారు ఆ పార్టీ గూడు దాటి బయటకు వెళ్ళారు. వారే కలలో సైతం ఊహించని పేరుగా ఉన్న వి విజయసాయిరెడ్డి. ఆయన అంటే జగన్ కి నీడ అని చెబుతారు. జగన్ తో పాటే ఆయన ప్రయాణం సాగింది. అంతకంటే ముందు వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాలుగా ఆయన సుదీర్ఘ ప్రస్థానం సాగింది.
అటువంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడినా ఆ పార్టీ పెద్దగా ఏమి జరుగుతుంది అని అనుకోని ఉండొచ్చు. కానీ జరిగింది వేరుగా ఉంది. విజయసాయిరెడ్డి ఆ మధ్య విజయవాడలో సీఐడీ విచారణకు హాజరై అన్యాపదేశంగా లిక్కర్ స్కాం గురించి కొన్ని పేర్లు చెప్పేశారు. ఇంకా కదిలిస్తే మొత్తం తెలుసు చెబుతా అన్నట్లుగా ఆయన ఆ మీడియా మీట్ లో మాట్లాడారు.
ఇక మరో కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వైఎస్ జగన్ కి దగ్గర బంధువు. ఆయన ఉండాల్సింది వైసీపీలోనే. మరి ఆయనకు ఏమి కష్టం వచ్చిందో తెలియదు వైసీపీని వీడారు. ఆయన సైతం వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు. ఆయనకు కూడా పార్టీలో జరిగే అన్ని విషయాలు తెలుసు అని అంటారు.
రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో బాలినేని ఆవేశంతో చేసిన ప్రసంగం జగన్ మీద నిప్పులు చెరిగిన వైనం చూసిన వారు అంతా ఆయనను కదిలిస్తే చాలానే చెబుతారు అని అంచనా వేస్తున్నారు. అంతలా సన్నిహితుడిన బాలినేనికి దూరం చేసుకోవడంలో ఎవరి పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే వైసీపీకే ఇపుడు ఇబ్బంది అని అంటున్నారు ఆయన ఫైర్ మీద ఉన్నారు. సో ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి వైసీపీ మీద టార్గెట్ చేసే కూటమి పెద్దలకు తన వంతుగా ఏమైనా సాయం చేసినా చేస్తారు అని అంటున్నారు.
ఇక నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలోనే ఉందామని అనుకున్నారని చెబుతారు. ఆయనను పొగబెట్టి వైసీపీలో వర్గ పోరు పంపించేసింది. ఆ సమయంలో హైకమాండ్ సరిగ్గా డీల్ చేయలేదని అంటూ వచ్చారు. మొత్తానికి ఇపుడు ఏకంగా పార్లమెంట్ లోనే లావు లిక్కర్ సార్ భారీ ఎత్తున వైసీపీ హయాంలో జరిగింది అని తీవ్ర విమర్శలు చేశారు. ఆ తరువాత సీబీఐ ఈడీలను రంగంలోకి దించాలని ఆయన కోరుతున్నది కూడా అంతా చూస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తున్న వారికి మాత్రం కీలక నేతల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే బిగ్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.