ఆ లోపంతో బాధపడేవారికి అమృతం లాంటిది.. ఉదయాన్నే ఇలా చేస్తే

ఉరుకులు పరుగుల జీవితం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు..


అయితే.. ఇటీవల కాలంలో విటమిన్ల లోపం కూడా వేధిస్తోంది.. ముఖ్యంగా.. శరీరంలో విటమిన్ బి12 లోపం అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకాలను గ్రహించకపోవడం, అనేక వైద్య పరిస్థితులు శరీరంలో విటమిన్ బి12 లోపానికి కారణమవుతాయి. దీని లోపం కారణంగా, ఒక వ్యక్తి అలసట, బలహీనత, జలదరింపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలకు గురవుతారు..

విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి, మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బలవర్థకమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ వార్తలో అలాంటి డ్రై ఫ్రూట్స్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.. అంజీర్ నీరు శరీరంలో విటమిన్ బి12 ను వేగంగా పెంచుతుంది. అందుకే.. దీనిని అమృతం లాంటిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. అదేంటంటే.. అంజీర్ (అత్తిపండ్లు) నీరు.. అత్తిపండ్లలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. అంజీర్ పండును లేదా.. డ్రైఫ్రూట్ గా కూడా తీసుకోవచ్చు

అంజీర్‌ నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

అంజీర్ నీరు విటమిన్ బి12 లోపాన్ని తొలగిస్తుంది..

విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి అంజీర్ నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన అంజీర్ పండ్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి..

కడుపు ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్ నీరు శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది.

ఐరన్, ఫోలేట్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు అంజీర్‌లో కనిపిస్తాయి..

ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల పెరుగుదలను పెంచడంలో.. విటమిన్ బి12 శోషణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అంజీర్ నీటిని ఎలా తయారు చేయాలి?

అంజీర్ డ్రైఫ్రూట్ ను నానబెట్టి తింటారు. అంజీర్ నీటిని తయారు చేయడానికి, అంజీర్ పండ్లను నానబెట్టి, రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం దాన్ని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే అంజీర్ నీరు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.