ఈపీఎఫ్‌వో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. యూఏఎన్ క్రియేట్ చేయడంలో కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త విధానం ఏంటీ..?దాని వల్ల కలిగే ఇబ్బందులు ఏంటీ..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పీఎఫ్ అనేది ప్రైవేట్ ఎంప్లాయిస్ అందరికీ ఒక గోల్డ్ నిధి వంటిది. కష్టసమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పీఎఫ్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ..ప్రజలకు ఈజీగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ క్రియేట్ చేయడంలో సరికొత్త విధానం తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుండి కొత్త యూఏఎన్ కోసం ఆధార్ కార్డుతో ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రకటించింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఈ ప్రక్రియను ఉమాంగ్(UMANG) యాప్ ద్వారా మాత్రమే చేయాలి.
కొత్త నిబంధనతో సమస్యలు
ఈ కొత్త రూల్ వల్ల చాలామంది ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయనివారు, స్మార్ట్‌ఫోన్ లేనివారు లేదా మంచి కెమెరా లేనివారు ఫేస్ అథెంటికేషన్‌లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల యూఏఎన్ సృష్టించే క్రియేట్ చేయడం నిలిచిపోయే అవకాశం ఉంది. యూఏఎన్ లేకపోతేన పీఎఫ్ ఖాతా యాక్టివేట్ కాదు. దాంతో పీఎఫ్ విత్ డ్రా, బ్యాలెన్స్ చెకింగ్ వంటివి చెక్ చేయడ కష్టమవుతుంది. అయితే ఇప్పటికే యూఏఎన్ యాక్టివేట్ ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నియమం కొత్త ఉద్యోగుల కోసం మాత్రమే వర్తిస్తుంది.
ఎవరికి సమస్యలు..?
ఆధార్-మొబైల్ లింక్ లేనివారు: ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం వల్ల ఫేస్ అథెంటికేషన్‌లో ఇబ్బందులు వస్తాయి.
కెమెరా సరిగ్గా రాకపోతే: స్మార్ట్‌ఫోన్ కెమెరా నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ఫేస్ స్కానింగ్ సరిగా జరగకపోవచ్చు.
స్టాఫింగ్ కంపెనీలు: కాంట్రాక్టుపై ఉద్యోగులను నియమించే పెద్ద స్టాఫింగ్ కంపెనీలు ఈ ప్రక్రియతో ఎక్కువ ఇబ్బందులు పడవచ్చు.
ఫేస్ స్కాన్ ఎందుకంటే..?
ఉమాంగ్ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక మొబైల్ యాప్. ఇందులో EPFOతో సహా అనేక ప్రభుత్వ సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. కొత్త ఉద్యోగులు ఈ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ చేస్తేనే యూఏఎన్ నంబర్ పొందుతారు. ఫేస్ స్కాన్ ప్రవేశపెట్టడానికి గల ప్రధాన కారణం, ఒకే వ్యక్తి పేరుతో రెండు యూఏఎన్‌లు ఉండటం లేదా వేరొకరి ఆధార్ ద్వారా యూఏఎన్ పొండం వంటి వాటిని నివారించడ. ఇది గుర్తింపును మరింత కచ్చితంగా ధృవీకరించడానికి, భద్రతను పెంచడానికి తీసుకొచ్చారు.
































