Essential Vaccines : 50 ఏళ్ల తర్వాత ఈ మూడు వ్యాక్సిన్లు తీసుకుంటే సరి

వయసు పెరిగే కొద్దీ అనేక రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి బలహీనపడడం మొదలవుతుంది. కండరాలు, ఎకముకల సమస్యలు పెరుగుతాయి. అలాగే, అనేక జీవసంబంధమైన మార్పులు మొదలవుతాయని.. వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 50 సంవత్సరాల తర్వాత.. గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, కంటి చూపు మందగించడం వంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచే జీవనశైలిలో మార్పులు, మెరుగైన ఆహారం తీసుకుంటే భవిష్యత్తులో అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. దాంతో పాటు 50 ఏళ్ల తర్వాత కొన్ని టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో అదనపు రక్షణ అందిస్తుందని పేర్కొంటున్నారు.

50 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని.. వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. కానీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వాధ్యులను నివారించవచ్చు. ప్రారంభంలోనే వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలాముఖ్యం. అయితే, కొన్ని టీకాలు మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడంలో సహాయపడుతాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), ఇండియన్ చెస్ట్ సొసైటీ, నేషనల్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఫ్లూ, న్యుమోనియా వృద్ధుల ఆరోగ్యానికి ప్రధానంగా ముప్పును కలిగిస్తాయి. ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోకాకల్‌ వ్యాక్సిన్స్‌ తీసుకోవాల్సిందే. అయితే, వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆయా వ్యాక్సిన్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెంజా అనేది అంటువ్యాధికి సంబంధించిన వైరస్‌. ప్రతి సంవత్సరం దాంట్లో ఉత్పరివర్తనాలు కనిపిస్తాయి. కాబట్టి వృద్ధులకు ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్‌ అవసరం పడుతుంది.

50 ఏళ్ల తర్వాత ఈ టీకా వేసుకోవడం మంచిది. సీజన్ల మార్పుతో వచ్చే ఫ్లూ వ్యాధిని నివారించడంలో ఈ సహాయపడునున్నది. న్యుమోనియా కేసులు అన్ని వయసుల వారిలో కనిపించినప్పటికీ.. ప్రమాదం వయసుతో పాటు పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. పీసీవీ13 వ్యాక్సిన్‌ 50 ఏళ్లు పైబడిన వారికి అందుబాటులో ఉంది. ఇది 13 రకాల న్యుమోనియా నుంచి రక్షిస్తుంది. ఈ టీకా రెండు మోతాదులు అవసరం. న్యుమోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులకు న్యుమోనియా ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని 50 నుంచి 70శాతం వరకు తగ్గిస్తుంది. చర్మపు దద్దుర్లు, దురద నుంచి ఉపశమనం కోసం.. రెండు నుంచి ఆరునెలల వ్యవధిలో రెండు డోసుల షింగిల్స్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. చర్మంపై దద్దుర్లు.. పీహెచ్‌ఎన్‌, జోస్టర్‌ వైరస్‌ల వల్ల కలిగే ఇతర సమస్యల నుంచి రక్షణ అందిస్తుంది. వయసు పెరిగే కొద్దీ, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీని కారణంగా వృద్ధుల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ టీకా ఇన్ఫెక్షన్ విషయంలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని 40 నుండి 70శాతం వరకు తగ్గిస్తుంది.