Jaggary: బెల్లం గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. బెల్లం తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బెల్లం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అసలే ఇప్పుడు చలికాలం. ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి.అలాగే ఈ కాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి రోజు బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ కాలంలో బెల్లం తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
బెల్లం ఉపయోగాలు :
బెల్లంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ బీ 12, బి 6, పోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.ఇంకా బెల్లంలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
అందుకే ప్రతిరోజు బెల్లంను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. భోజనం పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ ప్రక్రియ సులభతరమవుతుంది.
బెల్లం ఎలా తినాలంటే..?
బెల్లాన్ని పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. చాలా మంది పాలలో పంచదార వేసుకుని తాగుతారు. అలా కాకుండా పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది.బెల్లం తినడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.బెల్లం రోజూ తినడం ద్వారా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.బెల్లం తినడం వలన కలిగే ఇంకో ముఖ్యమైన లాభం ఏంటనే ఏది రక్తహీనతను తగ్గిస్తుంది.ఎందుకంటే బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది.ఇది శరీరంలోని ఎర్రరక్త కణాలను సంఖ్యను వృద్ధి చేస్తుంది.అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సీజన్ ను సరఫరా పెంచి, రక్తహీనతను అడ్డుకుంటుంది.కావున రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడే వారు తరుచు భోజనములో బెల్లంను చేర్చుకోవాలి.