IND vs ENG: చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్‌.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా!

www.mannamweb.com


ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌..
93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యశస్వీనే టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్‌ సెంచరీలు సైతం ఉన్నాయి. రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్న ఈ ముంబైకర్‌ ఇప్పుడు ఐదో టెస్టుకు సిద్దమవుతున్నాడు.

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు జైశ్వాల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ధర్మశాల టెస్టులో యశస్వీ మరో పరుగు చేస్తే.. ఇంగ్లండ్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి(655) రికార్డును బ్రేక్‌ చేస్తాడు.

ఈ రికార్డును రాంఛీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో జైశ్వాల్‌ బ్రేక్‌ చేశాడు. అదేవిధంగా మరో 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైశ్వాల్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి(692)ని అధిగమిస్తాడు.