జనవరిలో పుట్టిన వ్యక్తుల్లో ఉండే ప్రత్యేక లక్షణాలతో ప్రపంచాన్నే జయిస్తారట..!

www.mannamweb.com


ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జనవరి మాసం మొదటిది. ఈ నెల ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే జనవరితోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి నెలలో పుట్టిన వ్యక్తుల స్వభావం, స్వరూపం, గుణాలు, దోషాల గురించి తెలుసుకోవచ్చు. వీరిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు ఎందుకని ప్రత్యేకంగా ఉంటారు.. వీరికి ఉండే ప్రత్యేక లక్షణాలతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటారా? ప్రపంచాన్నే జయిస్తారా? వీరి స్వభావం ఏంటి.. వీరు ఎలా ప్రవర్తిస్తారనే ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరిలో పుట్టిన వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరిలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉండే వారిని బాగా నవ్విస్తారు. వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. అందుకే వీరికి నాయకత్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకుంటారు. ఈ కారణంగా వీరిని ప్రజలందరూ ఇష్టపడతారు. వీరు పని చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. దీన్ని చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. వీరి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.

ఆదర్శంగా ఉంటారు..
జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు ఏ పని అయినా కష్టపడి చేస్తారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా చాలా ధైర్యంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు అనేదే వేయరు. వీరు కొంచెం మొండిగా ఉన్నప్పటికీ, ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసేందుకు అందరికంటే ముందుంటారు. వీరు చాలా మందికి ఆదర్శంగా ఉంటారు. ఎల్లప్పూడు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తారు. ప్రపంచంలో వీరికంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు.

తమ ఆలోచనలు, అభిప్రాయాలను..
జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు సిద్ధాంతాలకు, తమ సొంత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు తమ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసే సమయంలో తమ అభిప్రాయాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. కలల ప్రపంచంలో జీవించడంలో వీరికి ఇష్టం ఉండదు. వాస్తవిక, ఆచరణాత్మక ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవిస్తారు. వీరు పరిమితుల్లో ఉండటానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉంటారు.

మోసపోతూ ఉంటారు..
జనవరిలో పుట్టిన వారి ప్రతికూల విషయానికొస్తే.. తమ లోపాలను వీరు గుర్తించలేరు. అందుకే చాలా మంది చేతిలో మోసపోతుంటారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటుగా వ్యవహరిస్తారు. ఇతరుల మాటలు వినడానికి ముందే రెస్పాండ్ అవుతారు. కొన్ని సందర్భాల్లో మతోన్మాదుల స్థాయికి కూడా వెళ్తారు. ఇతరులను అస్సలు లెక్క చేయరు.

కెరీర్ పరంగా..
జనవరిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన కెరీర్ కొనసాగిస్తారు. వీరు కష్టపడి విజయం సాధిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఆర్మీ, చార్టెడ్ అకౌంటెంట్, లెక్చరర్ లేదా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ రంగాలో మంచి విజయం సాధిస్తారు. వీరికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు.

లక్కీ కలర్స్, నెంబర్స్..
జనవరి నెలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్యలు: 5, 3, 1
వీరికి కలిసొచ్చే రంగులు : డార్క్ బ్లూ, రెడ్, లైట్ ఎల్లో
శుభ వారాలు : గురువారం, ఆదివారం, శుక్రవారం
శుభ రత్నాలు : గోమేధికం, నీలి పుష్పరాగం(మీ రాశి ప్రకారం రత్నాలను ధరించాలి).

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.