ఇప్పటి జీవనశైలిలో మతిమరుపు పెద్ద సమస్యగా మారింది. రోజంతా పని, ఒత్తిడితో చిన్న విషయాలే కాదు, ముఖ్యమైన వివరాల్ని కూడా మర్చిపోతున్నాం. అయితే మంచి వార్తేమిటంటే – జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
ప్రత్యేకంగా జపాన్ వారు వాడే కొన్ని సులభమైన, శాస్త్రీయంగా నిఖార్సైన పద్ధతులు దీనికి అద్భుత పరిష్కారంగా నిలుస్తున్నాయి.ఒక్కసారి వీటిని అలవాటు చేసుకుంటే, ఏ విషయం అయినా మనసులో నిలిచిపోతుంది. చదువుకునే విద్యార్థులకే కాదు, రోజూ పనిలో శ్రమించే ప్రతి ఒక్కరికీ ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- మైండ్ మ్యాపింగ్ (Mind Mapping)
ఒక విషయాన్ని మధ్యలో పెట్టి, దానికి సంబంధించిన ఆలోచనలు, టాపిక్స్‌ను కొమ్మలుగా విస్తరించే పద్ధతిది. దృశ్య రూపంలో సమాచారం ఉండటం వల్ల మెదడు సులభంగా గుర్తుంచుకుంటుంది. క్లిష్ట విషయాలు కూడా తేలికగా అర్థమవుతాయి. - నిమోనిక్స్ (Mnemonics)
క్లిష్టమైన సమాచారాన్ని గుర్తుపెట్టుకునేందుకు ఈ స్మృతి శ్రేణులు బాగా సహాయపడతాయి. జపనీస్‌లు దీన్ని తరచుగా వాడతారు. చిన్న పదబంధాలు, రైమ్స్, సంకేతాలు ఇలా ఏదైనా ఉపయోగించి పెద్ద సమాచారం గుర్తుంచుకోవచ్చు. - స్పేస్డ్ రిపిటీషన్ (Spaced Repetition)
ఒకే సమయంలో ఎక్కువగా చదవడం కన్నా, కొంత కొంతగా వదిలిపెట్టి పునఃసమీక్షించడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. అంకి, క్విజ్‌లెట్ వంటి యాప్‌లు దీనికి సరైన తోడ్పాటు అందిస్తాయి. - విజువలైజేషన్ (Visualization)
ఒక విషయం గుర్తుంచుకోవాలంటే, దాన్ని చిత్రాల రూపంలో ఊహించుకోండి. ఉదాహరణకు, చారిత్రక సంఘటన అయితే – రంగులు, వ్యక్తులు, సన్నివేశాలతో ఊహించండి. ఇది మెదడులో ఎక్కువ భాగాల్ని వినియోగించి సమాచారం నిలిపేస్తుంది. - మెమరీ ప్యాలెస్ (Memory Palace)
ఇది చాలా పురాతనమైన మరియు శక్తివంతమైన పద్ధతి. మనకు బాగా తెలిసిన ప్రదేశంలో (ఇల్లు, బజార్, కేఫే) అంశాలను ఊహలో అమర్చడం. తరువాత ఆ ప్రదేశాల్లో మానసికంగా తిరగటం ద్వారా సమాచారం గుర్తుకు తెచ్చుకోవచ్చు. - చంకింగ్ (Chunking)
పెద్ద సమాచారం మొత్తాన్ని చిన్న, సమర్థవంతమైన గుంపులుగా విభజించడం. ఇది మెదడుపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఫోన్ల నంబర్లు, పాస్‌వర్డ్లు గుర్తుపెట్టుకోవాలంటే ఈ పద్ధతి బెస్ట్. - కేకగోయ్ (Kakegoe)
ఇది Japanese సంప్రదాయ పద్ధతి. ముఖ్యమైన విషయాలను లయబద్ధంగా బిగ్గరగా పలకడం ద్వారా మెదడు శ్రవణ, శారీరక భాగాలతో కలిసి పనిచేస్తుంది. టైకో డ్రమ్మింగ్, కబుకి నాటకాలలో ఇవి కనిపిస్తాయి.
ఈ పద్ధతులు కేవలం బోధన కోసం కాదు. ఎవరైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. పనిలో, జీవితంలో, విద్యలో… ఎక్కడైనా మతిమరుపు సమస్యను తగ్గించేందుకు ఇవి ఓ శ్రేష్ఠమైన మార్గం.
































