ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నియామకంలో భాగంగా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ 01-03-2025న ప్రారంభమై 21-03-2025న ముగుస్తుంది. అభ్యర్థులు IPPB వెబ్‌సైట్ ippbonline.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
SC/ST/PWD: రూ. 150 చెల్లించాలి.
ఇతర వర్గాలకు: రూ. 750 చెల్లించాలి.
IPPB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-03-2025
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 21-03-2025
IPPB రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:
కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అర్హత:
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు ద్వారా నెలకు రూ. 30,000 చెల్లిస్తారు.