ఈ నెల మీద బంగారంలాంటి పంటలు ఏమైనా ఉన్నాయి అంటే అవి సుగంధ ద్రవ్యాలు అని చెప్పవచ్చు. యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం భారత దేశంలోని కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు.
కనుక వీటికి ఉన్న డిమాండ్ ప్రపంచంలో మరెక్కడా ఉండదు అని చెప్పవచ్చు. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలోనే స్పైసెస్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ముఖ్యంగా యాలకులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు గ్రేడింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా యాలకుల సైజును బట్టి ఈ గ్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ పొడవు ఉన్నటువంటి యాలకులను విదేశాలకు పంపుతారు. అయితే విదేశాలకు ఎగుమతికి రిజెక్ట్ అయినటువంటి సరుకును దేశీయంగా విక్రయించుకోవచ్చు. ఇది క్వాలిటీ పరంగా ఏమాత్రం తీసిపోవు కేవలం పొడుగు తక్కువ ఉన్న కారణంగా వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యాపారస్తులు నిరాకరిస్తారు. ఇవి వీటిని కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో ప్యాకింగ్ చేసి విక్రయించుకున్నట్లయితే చక్కటి లాభం పొందవచ్చు. సాధారణంగా కేరళలో ఎక్స్‌పోర్ట్‌కు రిజెక్ట్ అయిన (సెకండ్ గ్రేడ్) యాలకులు, మిరియాలు, లవంగాలను స్థానిక రిటైల్ మార్కెట్లలో విక్రయించినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు.
మీరు ఎగుమతికి రిజక్ట్ అయినటువంటి యాలకులను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే కేరళలోని ఇడుక్కి జిల్లాలో వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఈ రిజెక్ట్ సెకండ్ గ్రేడ్ యాలకులను వందన్మేడు (Vandanmedu), పుట్టడి (Puttady), కుమిలి (Kumily), సంతన్పారా (Santhanpara), నెడుంకండం (Nedumkandam) మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తుంటారు. వీటిని ట్రేడర్లు వేలంపాట ద్వారా కొనుగోలు చేస్తారు.
సాధారణంగా సెకండ్ గ్రేడ్ యాలకుల ధర ఒక కేజీ 1800 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది. అంటే క్వింటా రెండు లక్షల రూపాయల వరకు పలకవచ్చు. ఇక తక్కువ వాసనా లైట్ కలర్ ఉన్నవి ఒక కేజీ1600 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇది క్వింటా రూ. 1,60,000 – రూ. 1,80,000 పలుకుతుంది. బ్రోకెన్, స్క్రాచ్ ఉన్న యాలకులు కేజీ 1300 నుంచి 1600 పలుకుతాయి. ఇవి క్వింటాలుకు 1,30,000 – 1,50,000 రూపాయల వరకూ పలకవచ్చు. అలాగే సెకండ్ గ్రేడ్ లవంగాలు, మిరియాలు సైతం ఈ మార్కెట్లలో లభిస్తాయి. సెకండ్ గ్రేడ్ మిరియాలు, లవంగాలు సైతం ఇడుక్కి జిల్లాలోని పైన పేర్కొన్న గ్రామాలకు చెందిన మార్కెట్లలోనే ఎక్కువగా విక్రయిస్తారు.
బిజినెస్ ప్లాన్ ఇదే
ఉదాహరణకు మీరు సెకండ్ గ్రేడ్ యాలకులను ఒక క్వింటా 1,70,000 రూపాయలు, ఒక క్వింటా మిరియాలు 68000 రూపాయలు, లవంగాలు 72,000 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తే సుమారు మీ పెట్టుబడి రూ. 3,10,000 వరకూ అయ్యే అవకాశం ఉంది. ( ధరలు జనవరి, 2026 మార్కెట్ రేటుకు సంబంధించినవి హెచ్చుతగ్గులు ఉండవచ్చు)
మీరు వీటిని 100 గ్రాముల చొప్పున 1000 ప్యాకెట్లుగా మార్చి విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు 100 గ్రాముల యాలకులను రూ. 350 చొప్పున విక్రయించవచ్చు. ఈ లెక్కన మీకు రూ. 3.50 లక్షలు లభిస్తాయి. ఇక మిరియాలు 100 గ్రాములు రూ. 120 చొప్పున విక్రయిస్తే మీకు రూ. 1.20 లక్షలు లభిస్తాయి. అలాగే లవంగాలను 100 గ్రాములు రూ. 180 చొప్పున విక్రయిస్తే రూ. 1,80,000 లభించే వీలుంది.
ఈ లెక్కన మీరు పెట్టిన పెట్టుబడి యాలకులు, లవంగాలు, మిరియాలపై ముందుగా అనుకున్నట్లుగా ఒక్కోటి క్వింటా చొప్పున పెట్టుబడి రూ. 3.10 లక్షలు కాగా వీటి. ప్యాకింగ్ , లేబుల్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కలిపి రూ. 50 వేలు కలిపితే మొత్తం పెట్టుబడి రూ. 3.60 లక్షలు అవుతుంది.
మీరు వాటిని 100 గ్రాముల చొప్పున విక్రయిస్తే మొత్తం లభించే లాభం యాలకులు (రూ. 3,50,000), మిరియాలు ( రూ. 1,20,000), లవంగాలు (రూ. 1,80,000) కలిపితే సుమారు రూ. 6,50,000 లభించే వీలుంది. మీ లాభం నుంచి రూ. 3.60 లక్షల పెట్టుబడి తీసివేస్తే సుమారు రూ. 2.90 లక్షల లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 80 శాతం వరకూ లాభం పొందవచ్చు.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని పాఠకులకు సూచిస్తోంది.



































