ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(IIPE) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 31న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ (మెకానికల్ ఇంజినీరింగ్), ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్ ఇంజినీరింగ్), ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్), ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
జూనియర్ అసిస్టెంట్: 10
ల్యాబ్ అసిస్టెంట్(మెకానికల్ ఇంజినీరింగ్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కెమికల్ ఇంజినీరింగ్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కెమిస్ట్రి): 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 31
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: రూ.32,000 వేతనం కల్పిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్:https://iipe.ac.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32 వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.