ఈ ఒక్క ఆకు వాడితే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

చిన్న వయసులోనే తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? డోంట్ వర్రీ. రసాయనాలు కలిగిన రకరకాల హెయిర్ కలర్స్, హెన్నా వంటివి వాడేకంటే, ఈ ఒక్క ఆకు రాస్తే చాలు, తెల్లబడిన మీ జుట్టు నల్లగా మారడం పక్కా అంటున్నారు చిట్కా వైద్యులు.


గోరింటాకు కాదు కానీ.. ఆ ఆకులో మీ జుట్టును నల్లగా మార్చే పోషకాలు ఫుల్లుగా ఉన్నాయి. ఇంతకీ ఏంటా ఆకు? ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

ఆయుర్వేదిక్ చిట్కా నిపుణుల ప్రకారం తమలపాకులు మీ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకోసం కొబ్బరి లేదా ఆవ నూనెలో 10 నుంచి 15 తమల పాకులను వేసి, కాసేపు మరగబెట్టాలి. ఆకులు నల్లగా మారిన తర్వాత ఆ ఆయిల్‌ను వడకట్టి, జుట్టుకు మొత్తం అప్లయ్ చేసి ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇలా వరుసగా చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, సి, బి1తోపాటు పొటాషియం, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. దీంతోపాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.  అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.