ఆదోని మండలం జాలిమంచి వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొట్టింది

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని మండలం జాలిమంచి వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పగళ్‌ గ్రామానికి చెందిన వీరన్న (25), ఆదిలక్ష్మి (20) ద్విచక్రవాహనంపై వస్తున్నారు. వీరి వెనుక కర్ణాటకకు చెందిన దేవరాజు, నాగరత్న, హేమాద్రి మరో బైక్‌పై వెళ్తున్నారు. ఈ రెండు ద్విచక్రవాహనాలను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరన్న, ఆదిలక్ష్మి, దేవరాజు, నాగరత్న అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న హేమాద్రిని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. సంఘటన స్థలాన్ని ఆదోని డీఎస్పీ పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.