కేంద్రం స్కీమ్.. వ్యాపారానికి 10 లక్షల వరకు లోన్.. మొత్తం కట్టాల్సిన అవసరం లేదు!

www.mannamweb.com


ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభిస్తున్నారు. అలాగే వ్యాపారంలో మహిళలను ప్రోత్సాహించి వారి సొంత కాళ్ల మీద నిలబడే విధంగా.. రకరకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. కాగా, సొంతంగా వ్యాపారం చేయాలి అనుకున్నవారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. పైగా ఈ పథకంలో సబ్సిడీ ద్వారా లోన్ కూడా అందిస్తున్నారు. మరి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ కొత్త పథకం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది. కాగా, సొంతగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నా వారికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు. అయితే దేశంలో ఉండే నిరుద్యోగులకు సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అద్భుతమైన స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. పైగా దీనిపై 35 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇక సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. అలాగే తక్కువ వడ్డీకే పెట్టుబడిని అందుకుని తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. ఇక మీరు తీసుకునే రూ.10 లక్షల రుణంలో కేంద్ర ప్రభుత్వమే రూ. 3.5 లక్షల వరకు చెల్లిస్తుంది. అయితే ఇందులో మీరు చెల్లించాల్సింది రూ. 6.5 లక్షలు మాత్రమే. కనుక ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

అయితే మెక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఈ లోన్స్ అందిస్తుంది. ఈ క్రమంలోనే.. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం (PMFME) తీసుకొచ్చింది. ఇక ఆహార శుద్ధి రంగంలో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో..కేంద్రం ఈ స్కీమ్ ప్రారంభించింది. అయితే దీనిని మీ ఊరిలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా ప్రారంభించవచ్చు. అలాగే పీఎంఎఫ్ఎం పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. కనుక అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఇందులో మీరు ఏర్పాటు చేసే యూనిట్ ఖర్చు రూ. 10 లక్షలు అయితే.. అందులో 90 శాతం కేంద్రం రుణం ఇస్తుంది.

అయితే మిగిలన 10 శాతాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు రూ. 9 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈ లోన్ పై మీకు 35 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అంటే దాదాపు రూ. 3.15 లక్షల వరకు మాఫీ అవుతుంది. కనుక ఈ స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకోవాలి అనుకునే వారు https://pmfms.mofpi.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో ఇప్పటి వరకు మొత్తం 2,46,102 దరఖాస్తులు వచ్చినట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అందులో వ్యక్తులు 2,43,400 మంది ఉండగా.. సంఘాలు 2,385 ఉన్నాయి. వీటిల్లో 87,355 దరఖాస్తులకు ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి. అందులో 67,949 మందికి రుణాలు పంపిణీ చేశారు. ఓడీఓపీ అప్లికేషన్లు సబ్మిట్ చేసినవి 45,949 ఉన్నాయి. పీఎంఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.