విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘వీడీ 12’
ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్
తారక్ వాయిస్ తో విడుదలైన టీజర్ మరింత పవర్‌ఫుల్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అలాగే మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.
ఇక టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తారక్ వాయిస్ తో తాజాగా విడుదలైన టీజర్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపించింది. విజయ్ లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు.
జెర్సీ వంటి సూపర్ హిట్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కినట్లు టీజర్ చూస్తూంటే తెలుస్తోంది. ఇక తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్న కింగ్‌డమ్ సినిమా ఈ వేసవి కానుకగా మే 30న వరల్డ్‌వైడ్ గా విడుదల కానుంది.