కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు.
కర్నూలు: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈవో నర్సారెడ్డికి అందజేశారు. నాగరాజు 2021లో కర్నూలు మండలం పంచలింగాల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రామయ్యపై 1,11,298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీ కావడంతో ఎంపీటీసీ పదవికి నాగరాజు రాజీనామా చేశారు.