రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ సంచలనం
సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి జరిగిన సమయంలో బట్టలు లేకుండా బయటకు వచ్చిన లేడీ అఘోరీ, అప్పట్లోనే సెన్సేషన్ సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తరచుగా వార్తల్లో నిలిచింది. ఇటీవల ఒక యువతిని తనతో తీసుకువెళ్లి మళ్లీ హాట్ టాపిక్ అయింది.
యువతిని శిష్యురాలిగా చేసుకున్న ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా బీటెక్ విద్యార్థిని వర్షిణిని తన శిష్యురాలిగా మీడియాకు పరిచయం చేసింది ఈ అఘోరీ. దీంతో ఆమె మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ యువతితో కలిసి అనేక ఆలయాలను సందర్శిస్తుంది. కానీ, వర్షిణి తల్లిదండ్రులు తమ కుమార్తెను మాయచేసి, మంత్రించి తీసుకుపోయిందని అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
వర్షిణి అన్న హర్ష కూడా అఘోరీపై సంచలన ఆరోపణలు చేశాడు. “అఘోరీ నా చెల్లెలు వర్షిణిపై మంత్రాలు చేసి వశపరచుకుంది. మా ఇంట్లో రెండు వారాలు ఉండగా, రోజూ మద్యం తాగేది, సిగరెట్లు కాల్చేది. చివరికి కండోమ్ ప్యాకెట్లు కూడా తెమ్మని డిమాండ్ చేసింది” అని ఆయన ఆరోపించారు.
అఘోరీపై దాడి – సూర్యపేటలో ఘర్షణ
ఈ మధ్య, సూర్యపేటలో ఒక యువకుడు అఘోరీపై దాడి చేశాడు. ఆమె మెడ పట్టుకుని గుంజిన యువకుడిని చుట్టూ ఉన్నవారు ఆపడానికి ప్రయత్నించినా, అతను వదలలేదు. ఈ సందర్భంగా అఘోరీ కూడా యువకుడి షర్టు కాలర్ పట్టుకుని ఫేస్-టు-ఫేస్ గా ఘర్షణ చేసుకుంది.
ఈ సంఘటనతో అఘోరీ ఇప్పుడు మరింత వివాదాల్లోకి వచ్చింది. ఆమె కార్యకలాపాలు, ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీవిషయం అయ్యాయి.