LIC Bima Sakhi Yojana: మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారా ప్రతినెలా ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారా అయితే మహిళల కోసం ఇది ఒక శుభవార్త అనేది చెప్పాలి. ఎందుకంటే ఎల్ఐసి సంస్థ మహిళల కోసం ఎల్ఐసి బీమా సఖి యోజన అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ఎల్ఐసి గ్రామీణ మహిళలను బీమా ఏజెంట్గా మార్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి నెల వేతనం కూడా అందిస్తోంది. మీరు కూడా ఈ స్క్రీన్ లో చేరాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న సమాచారం పూర్తిగా తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి మహిళల ఆర్థిక స్వావలంబన వారి ఆదాయం కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు ఎల్ఐసి బీమాసఖి యోజన. ఇది మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందించే పథకం. ఈ స్కీం కింద గ్రామీణ మహిళలు ఎల్ఐసి బీమా ఏజెంట్ గా మారి డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. . ఇందుకోసం మీరు నెలకు కనీస ఆదాయం 7వేల రూపాయల వరకు పొందుతారు ఈ పథకాన్ని భారత ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభించింది.
ఈ స్కీం అర్హతలు ఇవే (LIC Bima Sakhi scheme eligibility) :
ఈ స్కీం కింద కనీస అర్హతల విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 50 సంవత్సరాల మహిళలు ఇందులో పాల్గొనవచ్చు కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత అందిస్తున్నారు. అయితే ఎల్ఐసి ఉద్యోగులు అదే విధంగా వారి బంధువులకు ఈ ఉద్యోగం చేసేందుకు అర్హత లేదు.
ఎల్ఐసి బీమా సఖి యోజన వల్ల ఉపయోగాలు ఇవే.. (LIC Bima Sakhi benefits):
ఈ స్కీము ద్వారా మొదటి సంవత్సరం నెలకు 7000 రూపాయలు లభిస్తుంది. ఇక రెండవ సంవత్సరం నెలకు 6000 రూపాయల వేతనం లభిస్తుంది. . మూడవ సంవత్సరం నెలకు 5000 రూపాయల వేతనం లభిస్తుంది. . అయితే మీరు బీమా పాలసీలు విక్రయించే కొద్దీ మీకు అందులో అదనపు ప్రోత్సాహకాలు, పాలసీ విక్రయించడంపై కమిషన్ లభిస్తాయి. మీరు ఎల్ఐసి ఏజెంట్గా చేరి అధికారిగా వారి అవకాశం లభిస్తుంది. . మీరు ఎన్ని ఎక్కువ బీమా పాలసీల వ్యతిరేస్తే అంత ఆదాయం లభిస్తుంది.
మీరు కూడా బీమా సఖిలో చేరాలి అనుకున్నట్లయితే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇది కావాల్సిన అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎంపికైన మహిళలకు ప్రత్యేకమైన శిక్షణ ఆర్థిక సహాయం కూడా అందిస్తారు.
ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే ( LIC Bima Sakhi benefits):
ముఖ్యంగా గ్రామీణ మహిళలను ఉద్దేశించి ప్రారంభించిన ఈ ఉపాధి పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమా పాలసీలను వ్యతిరేయించడానికి వారిలో ఫైనాన్షియల్ లిటరసీ పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే బీమా సేవలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.