Lord Ram: బాలరాముడి ముఖం రివీల్ చేశారుగా.. అయోధ్య రాముడి ఫుల్ సైజ్ ఫస్ట్ పిక్ ఇదే

www.mannamweb.com


Ayodhya Ram Idol Face: అయోధ్యలో రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు.
తాజాగా, ఆ రాముడి విగ్రహం ముఖాన్ని రివీల్ చేశారు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్ షాప్‌లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ముఖం ఇలా ఉన్నది.

ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు.

ఈ బాల రాముడి చేతిలో బంగారి విల్లు, బాణం ఉన్నాయి. రాముడి బంగారు వర్ణం అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.

బాలరాముడి మనోహర రూపం ఇదిగో.. ప్రాణప్రతిష్ఠకు ముందే దర్శనం

Ayodhya Ram Mandir: అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతోంది. బాలరాముడికి సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు.
ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహ పూర్తి భాగం కనిపించే ఫొటోలు విడుదలయ్యాయి.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. దీనికి దాదాపు ఏడు వేల మంది హాజరవుతారు. సరయూ నదీ తీరంలో నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భవ్యరామ మందిరం అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిపోనుంది.

అయోధ్య అభివృద్ధి
అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. రామమందిర నిర్మాణం ప్రారంభమయిన దగ్గరినుంచే అయోధ్య అభివృద్ధి వేగంగా జరుగుతోంది. గతంలో అయోధ్యకు, ప్రస్తుత పట్టణానికి చాలా తేడా ఉంది. రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణం, ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు వంటివే కాదు…అడుగడుగునా అయోధ్యలో మార్పు కనపడుతోంది. ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ ఇకపై అయోధ్య భారత్‌లో కీలక ప్రాంతంగా నిలవనుంది. రామమందిరం ప్రారంభం అయినదగ్గరనుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో…అందరూ సౌకర్యవంతంగా ఉండేలా అయోధ్యను తీర్చిదిద్దుతున్నారు.

అయోధ్య పునర్‌నిర్మాణం కోసం పెడుతున్న ఖర్చు రూ.85 వేల కోట్లు…. పదేళ్లలో అయోధ్య స్వరూపం సమూలంగా మార్చివేయడం కోసం భారీగా నిధులు ఖర్చుచేస్తున్నాయి కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు. రామమందిరం ప్రారంభం తర్వాత రోజూ మూడులక్షలమంది అయోధ్యను సందర్శిస్తారని ఓ అంచనా. దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అయోధ్యను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్యలో ఏ మూల చూసినా త్రేతాయుగం ఆనవాళ్లు కనిపించేలా రూపురేఖలు మారిపోయాయి. ప్రతిచోటా రామాయణ ఇతిహాసపు గుర్తులు కనిపిస్తున్నాయి. త్రీడీ ఆర్ట్‌ వర్క్క్‌ అయోధ్యకు సరికొత్త రూపంలో ఆవిష్కరిస్తున్నాయి.

విశాలమైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సువిశాల సరయూ తీరం, నది ఒడ్డున ఘాట్‌లు, అండర్‌ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, భవనాల పునర్‌నిర్మాణంతో..అయోధ్య అభివృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయోధ్య ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకొచ్చింది. రైల్వేస్టేషన్…ఎయిర్‌పోర్టులను తలదన్నేలా పునర్‌నిర్మితమైంది.

అయోధ్యాపురి హైవే నుంచి వాహనం దిగగానే సువిశాల కారిడార్, స్వాగత తోరణం నుంచి ఎత్తయిన స్తంభాలు, రామాలయం ప్రవేశమార్గం వంటివి అయోధ్యను శోభాయమానంగా మార్చేశాయి. అయోధ్య విద్యుత్ వ్యవస్థ కూడా మారిపోయింది. విద్యుత్ వైర్లు గాలిలో ఎక్కడా కనిపించకుండా అండర్‌గ్రౌండ్ విద్యుత్ సరఫరా జరగనుంది. సరయూ నదీ తీరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మాలీ కుండ్ వరకు 10.2 కిలోమీటర్ల మేర 470 సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయ సముదాయంతో పాటు అయోధ్య మొత్తాన్ని ఆధ్యాత్మికంగానూ, పర్యాటకంగానూ, ఆర్థికంగానూ తీర్చిదిద్దుతున్నారు. లక్షలమంది పర్యాటకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అంతర్జాతీయ స్థాయిలో అయోధ్య ఆతిథ్య ప్రాంతంగా మారనుంది. అయోధ్యతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అయోధ్య పునర్‌నిర్మాణం…యాత్రాస్థలాలు, పర్యాటకపరంగా ఓ విప్లవంలాంటిదని ఆర్థికనిపుణులు అంటున్నారు. అయోధ్య చారిత్రక నేపథ్యం,సాంస్కృతిక వారసత్వం కొనసాగిస్తూనే అధునాతన అయోధ్యను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.

రామమందిర నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అయోధ్యలో స్థానికులు, పర్యాటకుల నిష్పత్తి 1:10గా ఉంటుందని అంచనావేస్తున్నారు. 31వేల 662 కోట్ల బడ్జెట్‌తో 37 రాష్ట్ర్ర, కేంద్ర ఏజెన్సీలు ప్రస్తుతం అయోధ్య రూపురేఖలు మార్చడంలో నిమగ్నమై ఉన్నాయి. ఆధ్మాత్మిక అయోధ్య, పరిశుభ్ర అయోధ్య, అందరికీ సౌకర్యవంతంగా ఉండే అయోధ్య, ప్రయోగాత్మక అయోధ్య, సాంస్కృతిక అయోధ్య, ఆరోగ్య అయోధ్య, ఆధునిక అయోధ్య, సమర్థవంతమైన అయోధ్య పేరుతో మొత్తం 8 కేటగిరీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అయోధ్యలో ఆతిథ్య రంగ దిగ్గజాలు
ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు, వాటర్ కంపెనీలు, ఆతిథ్య రంగ దిగ్గజాలు అయోధ్యలో బ్రాంచ్‌లు తెరుస్తున్నాయి. 2021లో అయోధ్యకు 3లక్షల25వేలమంది పర్యాటకులు వచ్చారు. 2022లో రెండుకోట్ల 39లక్షలమంది సందర్శించారు. 2031 నాటికి ఏటా నాలుగుకోట్లమంది అయోధ్యను సందరిస్తారని అంచనా. భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా అయోధ్యను ఆతిథ్యనగరంగా తీర్చిదిద్దనున్నారు.
ఇప్పటికే అయోధ్యలో యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలవుతోంది. వాణిజ్య, వ్యాపార భవనాలకు ఓ కేటగిరీ, నివాస భవనాలు మరో కేటగిరీ, ఆలయాలు, ఇతర ప్రార్థనాస్థలాలు ఇంకో కేటగిరీ, చారిత్రక కట్టడాలు, భవంతులు మరో కేటగిరీగా చేశారు. వీటికి రంగులు కేటాయించి డిజైన్, స్టయిల్‌లో మార్పుచేస్తున్నారు.

రోడ్డు విస్తరణతో తొలగించిన భవనాల స్థానంలో కొత్త భవనాలు, పాత భవనాల మరమ్మతులు, సామర్థ్యం పెంపు వంటివి వేగంగా జరుగుతున్నాయి. అదనపు అంతస్థులు, కొత్త నిర్మాణాలతో అయోధ్యలో రియల్‌ఎస్టేట్ ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతోంది. ప్రయివేట్ హోటళ్లు, రిసార్టులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా చారిత్రక ఆయోధ్య…ఇతిహాసపు కాలాన్ని గుర్తుకు తెస్తూనే..ఆధునిక అయోధ్య, పర్యాటక స్వర్గధామంగా కొత్తరూపు తెచ్చుకుంటోంది.