వెరైటీగా ఎగ్ సేమియా చేయండి.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు

www.mannamweb.com


ఎక్కువగా తినే బ్రేక్ ఫాస్ట్‌లో సేమియా కూడా ఒకటి. సేమియాలతో ఉప్మా లేదంటే పులిహోర తయారు చేసుకుని తింటారు. ఇవి కూడా ఎప్పుడూ తిని బోర్ కొడుతూ ఉంటాయి.

పిల్లలకు ఎప్పుడూ కాస్త వెరైటీగా, టేస్టీగా కావాలి. గోధుమలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సేమియాలను ఎంచుకునేటప్పుడు మైదాతో కాకుండా.. గోధుమలతో తయారు చేసేవి ఎంచుకోండి. ఇవి ఆరోగ్యం కూడా. సేమియాలతోనే పిల్లలు నచ్చే విధంగా ఎగ్ సేమియా తయారు చేసుకోవచ్చు. ఇది వెరైటీగా కూడా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఎగ్ సేమియాల ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు:

సేమియాలు, ఎగ్స్, నెయ్యి లేదా నూనె, పసుపు, కారం, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, సోంపు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయల, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, క్యారెట్, కొత్తి మీర.

ఎగ్ సేమియా తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి సేమియాలు వేసి గోల్డెన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకూ వేయించి, ఓ ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి గుడ్లు చితక్కొట్టి.. ఫ్రై చేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించి.. ఇంకో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్లీ ఆయిల్ వేసి.. లవంగాలు, బిర్యానీ ఆకులు, చెక్క, సోంపు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి.

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత టమాటాలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొలతగా నీళ్లు వేసి మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు సేమియా వేసి.. నీళ్లు ఇగిరిపోయేంత వరకూ కుక్ చేయాలి. చివరగా కొత్తిమీర చల్లాలి. ఆ నెక్ట్స్ కోడిగుడ్డు ఫ్రై వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ సేమియా తయారు.