సీతా ఫలంతో ఇలా రబ్డీ చేయండి.. తిన్నవాళ్లు మైమరచిపోతారు..

www.mannamweb.com


పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో ఇది ఒకటి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. ఇది తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. సీతా ఫలం తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇంత రుచిగా ఉండే సీతా ఫలంతో రబ్డీ చేస్తే.. ఆహా ఆ రుచే వేరు. రబ్డీ రుచి గురించి చెప్పేది ఏముంది. చాలా మంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి రబ్డీలో సీతా ఫలం కలిపితే ఆ రుచి మరింత పెరుగుతుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇంత రుచిగా ఉండే సీతా ఫలం రబ్డీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీతా ఫలం రబ్డీకి కావాల్సిన పదార్థాలు:

సీతా ఫలం గుజ్జు, పాలు, తేనె లేదంటే బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స తరుగు, గులాబీ రేకులు.

సీతా ఫలం రబ్డీ తయారీ విధానం:

ముందుగా పాలను ఓ గిన్నెలో వేసి చక్కగా అయ్యేంత వరకు మరగ బెట్టుకోవాలి. మూడు సార్లు ఉడుకు వచ్చాక మంట తగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు సగానికి ఇంకిపోయి.. చిక్కబడ్డాక యాలకుల పొడి, బెల్లం లేదా పంచదార లేదంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత సీతా ఫలం గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగాక.. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

చివరగా పైన గులాబీ రేకులు, డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. సిల్వర్ వార్క్‌తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్వీట్‌ని ఇలా వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు.. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌గా ఉన్నప్పుడు తిన్నా రుచిగానే ఉంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే సీతా ఫల్ రబ్డీ సిద్ధం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.