Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తలలో తెల్లవెంట్రుకలు కనిపించవు !

www.mannamweb.com


Mango Leaves Benefits : పండ్లలో రారాజుగా మామిడి పండ్లను చెప్పవచ్చు. వేసవికాలం కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే రుచికరమైన మామిడి పండ్లను తినటానికి ఇదే సరైన సమయం.
అయితే మామిడి పండు మాత్రమే కాదు, మామిడి ఆకులు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయన్న విసయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి మామిడి ఆకులను శుభ కార్యాలకు, ద్వారాలకు తోరణాలుగా ఉపయోగిస్తారు. అయితే మామిడి ఆకులు జుట్టు సంరక్షణ ,చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు.

మామిడి ఆకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ;

జుట్టు పెరగటానికి ;

జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ జుట్టు రాలడం అనే సమస్య వారి ఆశను ఒక పీడకలగా మార్చేస్తుంది. అధిక జుట్టు రాలడం అనేది ఆందోళన కలిగించే విషయం. జుట్టు రాలడానికి అనేక నివారణల గురించి వినే ఉంటారు. అయితే మామిడి ఆకులు జుట్టు రాలడాన్ని ఆపుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. మామిడి ఆకులు జుట్టు బలానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే విటమిన్లు A, C మరియు Eలను కలిగి ఉంటాయి.

వీటిలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎతో పాటు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాకుండా, జుట్టుపై మామిడి ఆకులను సమయోచితంగా ఉపయోగించడం వల్ల తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా , రక్త ప్రసరణను పెంచుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ నూనె జుట్టు సంరక్షణకు మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా ఉపకరిస్తుంది. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టును అకాల వృద్ధాప్యం, జుట్టు నెరిసిపోకుండా కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు, పునరుజ్జీవనం కోసం మామిడి ఆకులను ఉపయోగించవచ్చు.
తెల్లజుట్టును నివారిస్తుంది ;

ఇటీవలి కాలంలో యుక్తవయసు వారిలో జుట్టు తెల్లబడి పోతుంది. జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మామిడి ఆకులు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి. మామిడి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం అలాగే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా,జుట్టు పెరుగుదలను పెంచుతాయి. కొత్త జుట్టు పెరగడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

జుట్టును ఒత్తుగా, బలంగా ,మెరిసేలా ;

మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , మెరుపునివ్వటంలో సహాయపడతాయి.
ఇందుకోసం చేయాల్సిందల్లా .. తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను మీ తలపై అన్ని వెంట్రుకలను పట్టించాలి. ఈ హెయిర్ మాస్క్‌ని 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆతరవాత నీటితో స్నానం చేయాలి.

మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతోపాటు నల్లగా మారుతుంది.