సీనరేజ్‌లో భారీ మార్పులు- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

www.mannamweb.com


సీనరేజ్‌లో భారీ మార్పులు- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.

అమరావతి :ఖనిజాలకు సంబందించిన సీనరేజ్‌లో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను మార్పు చేసేందుకు గనుల శాఖ సన్నాహాలు ప్రారంభించింది.

అన్ని చిన్న తరహా ఖనిజాలపై సీనరేజ్‌ను ఒకే తరహాలో ఉంచేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీనరేజ్‌ రుసుమును 2020 ఫిబ్రవరిలో ఒకసారి సవరించగా, 2021 జూన్‌లో మరోసారి సవరించారు. ఆ తరువాత 2023లో మరోసారి సవరించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రానైట్‌ మినహా మిగిలిన ఖనిజాలకు వంద శాతం సీనరేజ్‌గా నిర్ణయించగా, గ్రానైట్‌కు 50 శాతంగా నిర్ణయించారు. ఇప్పుడు అన్ని రకాల ఖనిజాలకు ఒకే విధంగా సీనరేజ్‌ ఉండేలా చూడాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
అలాగే గనులకు సంబంధిరచిన వార్షిక లీజు మొత్తంపై మూడు రెట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా వసూలు చేసే విధానం ఉరడగా, దానిని కూడా మార్పు చేయాలని యోచిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పటివరకు ఒకే విడతగా వసూలు చేస్తున్నారు. దీనిని కూడా కొంతవరకు మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది గనుల అనుమతులను పునరుద్ధరించే సమయంలో పది రెట్లు డీడ్‌ నిధులను వసూలు చేసే విధానం ఉండగా, దానిపైనా కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పక్క రాష్ట్రాల్లో అధ్యయనం
మార్పులకు సంబంధించి కొంత మేరకు కసరత్తు జరిగినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గనుల లీజులు తీసుకురటున్న స్టేక్‌ హౌల్డర్లతో కూడా సంప్రదింపులు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.