మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు.
జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మేడారం జాతరలో గత రాత్రి ప్రధాన ఘట్టం పూర్తైన సంగతి తెలిసిందే. చిలకలగుట్ట నుంచి సమక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. ఆ క్షణంలో భక్త జనం ఉద్వేగానికి లోనయ్యారు. ఇవాళ వన దేవతలను భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు సాయంత్రం వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది.



































