ఎంజీ మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్లపై ధరలను తగ్గించింది. అందుకోసం కోసం ఓ స్కీం తీసుకొచ్చింది. ఈ స్కీంలో చేరిన వారికి ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ ధరకు వస్తాయి. ఇంతకీ ఆ స్కీం ఏమిటీ? దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. BaaS స్కీం ద్వారా ఈ కార్లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు.BaaS అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్. అంటే రెంట్ ఇచ్చి బ్యాటరీని తీసుకోవచ్చు. మీరు కిలోమీటరుకు ధర చెల్లిస్తే కంపెనీ బ్యాటరీని తీసుకెళ్లవచ్చు. ఈ స్కీంలో కస్టమర్లు బ్యాటరీ మొత్తం ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కారు కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్లు కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుందో, వారు ఎన్ని కిలో మీటర్లు తిరగాలి అనుకుంటున్నారో నిర్ణయించుకొని కేవలం అంత వరకు మాత్రమే డబ్బులు కడితే అప్పుడు బ్యాటరీ రీఛార్జ్ చేసి ఇస్తారు. దీని వల్ల కార్ల ధరలు బాగా తగ్గుతున్నాయి.
ఇక MG కామెట్ EV ప్రారంభ ధర వచ్చేసి రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కారును BaaS స్కీం ద్వారా కొనుగోలు చేస్తే కేవలం రూ.4.99 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే పొందవచ్చు. దీంతో వినియోగదారులకు రూ.2 లక్షలు సేవ్ అవుతాయి. అయితే కారు కొన్న తర్వాత బ్యాటరీ అద్దెకు కిలోమీటరుకు రూ.2.5 చెల్లించాలి. మీరు ఎన్ని కిలో మీటర్లు తిరగాలనుకుంటున్నారో చెబితే దాన్ని బట్టి సర్వీస్ సెంటర్ లో అంత రీఛార్జ్ చేసి బ్యాటరీ ఫిక్స్ చేసి ఇస్తారు. ఈ కార్ రేంజ్ విషయానికొస్తే ఈ కారుని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 230 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు.
ఇక MG ZS EV ఎలక్ట్రిక్ కారు ధర రూ.18.98 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) స్టార్ట్ అవుతుంది. అయితే BaaS స్కీం ద్వారా ఈ కారును కొనుగోలు చేస్తే ఈ కారును మీరు కేవలం రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే వినియోగదారులకు ఏకంగా రూ.5 లక్షలు సేవ్ అవుతాయి. అయితే BaaS స్కీం ద్వారా ఈ కారుకు కిలోమీటరుకు రూ.4.5 చెల్లించాలిసి ఉంటుంది. ఇక ఈ MG ZS EV రేంజ్ విషయానికొస్తే ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 461 కిలోమీటర్ల దాకా రేంజిని ఇస్తుంది.