చికెన్, మటన్‌కి ఏమాత్రం తీసిపోని “మిల్ మేకర్ కర్రీ”.. ఎలా చేయాలంటే

మిల్‌ మేకర్ (సోయా చంక్స్).. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఇవి శాకాహారులకి మాంసాహారానికి ప్రత్యామ్నాయం. జిమ్ చేసే వారు, బరువు తగ్గాలని చూసే వారు, పిల్లలకు మంచి పోషకాహారంగా ఇవ్వాలని భావించే వారందరికీ ఇది బెస్ట్ ఆప్షన్.


అయితే ఇవి చాలామందికి అంతగా ఇష్టం ఉండదు. అందుకే వీటిని కొంచెం జాగ్రత్తగా, సరైన మసాలాలతో వండితే… దాని రుచి అచ్చం నాన్‌-వెజ్ కర్రీలా ఉంటుందని చాలా మంది అంటుంటారు.

ముఖ్యంగా టొమాటోతో చేసిన కర్రీలో మీల్ మేకర్ అద్భుతంగా కలిసి, అన్నం, చపాతీ ఏదితోైనా రుచిగా తినిపిస్తుంది. ఇంట్లో కూరగాయలు లేని రోజుల్లో అయితే ఈ కర్రీ ఈజీగా చేసెయ్యొచ్చు. మిల్‌ మేకర్‌ నానబెట్టి మసాలాలలో బాగా వేపితే ఇంకా మంచి రుచి ఇస్తుందని వివరిస్తున్నారు. గరం మసాలా రుచి కలిసినప్పుడు మీల్‌ మేకర్‌ కర్రీ మరింత పుల్లగా, స్పైసీగా, హోమ్ స్టైల్ టేస్ట్‌తో తయారవుతుంది. అందుకే మీకోసం ప్రత్యేకంగా ఈ వంట ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈజీ టిప్స్ తో చేసే ఈ వంట చికెన్, మటన్‌కి ఏమాత్రం తీసిపోదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కావాల్సిన పదార్థాలు..

మిల్ మేకర్ (సోయా చంక్స్): 1 కప్పు

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)

టొమాటోలు: 3-4 (సన్నగా తరిగినవి)

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

పచ్చిమిర్చి: 1-2 (తరిగినవి)

నూనె: 2-3 టేబుల్ స్పూన్లు

జీలకర్ర: 1 టీస్పూన్

పసుపు: 1/4 టీస్పూన్

కారం: 1-2 టీస్పూన్లు

ధనియాల పొడి: 1-2 టీస్పూన్లు

గరం మసాలా: 1/2 టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర: గార్నిష్ కోసం

నీళ్లు: అవసరమైనంత

తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి మీల్ మేకర్‌ను 15-20 నిమిషాలు నానబెట్టాలి.

అది ఉబ్బి మెత్తబడిన తరువాత నీటిని పూర్తిగా పిండేయాలి. ఇలా పిండడం చాలా ముఖ్యం-దీనివల్ల మసాలాలు చంక్స్‌కు బాగా సోకుతాయి.

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి తాలింపు రాగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత టొమాటోలు వేసి పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మసాలా నూనె పైకి తేలే వరకు సిమ్‌లో ఉడికించాలి.

ఇక నానబెట్టి పిండిన చంక్స్‌ను ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. 4-5 నిమిషాలు వేయిస్తే మసాలా బాగా పట్టిపోతుంది.

ఇప్పుడు సుమారు 1 నుండి 1½ కప్పుల నీళ్లు వేసి మూత పెట్టి 10-12 నిమిషాలు ఉడికించాలి.

ప్రెషర్ కుకర్‌లో చేస్తే 2 విజిల్స్ సరిపోతాయి. గ్రేవీ మీకు కావాల్సినట్టు వచ్చేలా నీళ్లు పోసుకోవాలి/

చివరగా స్టౌ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవచ్చు.

అదనపు చిట్కాలు..

మీల్ మేకర్‌ను నానబెట్టేటప్పుడు నీళ్లలో కొద్దిగా పసుపు వేసినా బాగుంటుంది.

టొమాటోలు ఎక్కువగా వేస్తే కర్రీ పుల్లగా, హోటల్ స్టైల్‌గా అవుతుంది.

కారం బదులుగా రెడ్‌ చిలీ పేస్ట్ వేసినా కర్రీ మరింత రంగు వస్తుంది.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్‌కైనా, డిన్నర్‌కైనా ఈ కర్రీ సూపర్‌గా సూటవుతుంది.

ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత వేడి చేసినా రుచి అలాగే ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.