చిరుధాన్యాలతో పలావ్ చేసుకుని తిన్నారంటే ఇంటిల్లిపాదికీ ఆరోగ్య సమస్యలే ఉండవు

www.mannamweb.com


ఆరోగ్యకరమైన ఆహారమే మీ లక్ష్యమా? ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మీకు నచ్చిన అన్ని రకాల చిరుధాన్యాలు కలిపి ఇలా టేస్టీగా పలావ్ చేసుకుని తిన్నారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇదిగో ఇలా ఈజీగా వండుకుని తినేయండి.

చిరుధాన్యాలు(Millets) ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ లతో పాటు విటమిన్లు- బీ6, 3 లు, కెరోటిన్, లెసిథిన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటమే కాక అసిడిటీ, అరుగుదల వంటి సమస్యలు దూరమవుతాయి. అందుకే ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో వీటిని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

మీరు కూడా మీ డైట్లో మిల్లెట్లను చేర్చుకోవాలనుకుంటే.. ఆరోగ్యంతో పాటు రుచిని కూడా కోరుకుంటుంటే ఈ రెసిపీ మీ కోసమే. చిరుధాన్యాలతో చక్కగా పలావ్ చేసుకుని ఉదయం లేదా సాయంత్రం నిస్సందేహంగా తినచ్చు. మిల్లెట్ పలావ్ తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి.

మిల్లెట్ పలావ్ కోసం కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు చిరుధాన్యాలు(మిల్లెట్లు)
ఒక ఉల్లిపాయ
ఒక టమాటా
ఒక పచ్చిమిర్చీ
అంగులం అల్లం ముక్క
రెండు లవంగాలు
రెండు వెల్లుల్లి రెబ్బలు
ఒక టీ స్పూన్ జీలకర్ర
ఒక బే ఆకు(బిర్యానీ ఆకు)
రెండు యాలకులు
ఒక దాల్చిన చెక్క ముక్క
ఒక టీస్పూన్ గరం మసాలా
అర టీస్పూన్ పసుపు
పావు కప్పు తరిగిన కొత్తిమీర ఆకులు
రుచికి తగినంత ఉప్పు
రెండు టేబుల్ స్పూన్ల నూనె
కప్పు మిక్సిడ్ వెజిటేబుల్స్(మీకు నచ్చినవి)
మిల్లెట్ పలావ్ తయారీ విధానం:

ముందుగా సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు, సామలు, ఊదలు, ఉలవలు, అరికెలు, ఆండ్రూ కొర్రలు, ధాన్యాలు వంటి అన్ని రకాల చిరుధాన్యాలను తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి.
ఇవన్నీ అరగంటరకు పైగా నానిన తర్వాత వడకట్టి నీరు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అది వేడెక్కిన తర్వాత నూనె పోయండి.
నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించండి.
ఇవన్నీ నూనెలో కాస్త గోలిన తర్వాత దీంట్లో తరిగిన ఉల్లిపాయ, అల్లం, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా కలపండి.
ఉల్లిపాయలు చక్కగా వేగి బంగారు రంగులోకి మారిన తర్వాత దీంట్లోనే టమాటాలు వేసి వేయించండి.
టమాటాలన్నీ చక్కగా నూనెలో ఫ్రై అయి మెత్తగా మారిన తర్వాత దీంట్లో పసుపు, కారంపొడి, గరం మసాలా,వేసి కలపండి.
మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత బఠానీలు, క్యారెట్లు, బీన్స్, కాలీఫ్లవర్ వంటి మిక్సిడ్ వెజిటెబుల్స్ ను వేసి వేయించండి. ఇంకా మీకు నచ్చిన ఇతర కూరగాయలను కూడా వేసుకోవచ్చు.
కూరగాయలన్నీ కాసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మిల్లెట్లు ఉడకడానికి సరిపడా నీరు పోయండి.
ఈ నీరు మరిగేంతవరకూ అలాగే ఉంచండి. మధ్యలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలపండి.
నీళ్లన్నీ మరుగుతున్నప్పుడు దాంట్లో ముందుగా నానబెట్టి, వడకట్టి పక్కక్కు పెట్టుకున్న చిరుధాన్యాలను దీంట్లో వేయండి.
మిల్లెట్లన్నీ చక్కగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతే హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ పలావ్ తయారయినట్టే. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గానూ, రాత్రి పూట డిన్నర్ గానూ తినచ్చు. పిల్లలకు పెద్దలకూ ప్రతి ఒక్కరికీ ఇది చాలా మంచి ఆహారం.