Mobile Settings:మీ ఫోన్ లో సిగ్నల్ ప్రాబ్లమా.4 సెట్టింగ్స్ చేయండంతే..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మొబైల్ ఉండడమే కాకుండా హై స్పీడ్ డాటా తో మొబైల్ లో బ్రౌజ్ చేస్తున్నారు.
ఈ తరుణంలో ఏ మాత్రం స్పీడ్ తగ్గిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. మనం చేసే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది ఫోన్ లో ఇంటర్నెట్ అనేది చాలా స్లోగా వస్తుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటయ్యా అంటే ఫోన్ సెట్టింగ్స్. ఈ నాలుగు సెట్టింగ్స్ చేస్తే ఫోన్ డేటా స్పీడ్ గా ఉంటుందని అంటున్నారు. అదేంటో చూద్దాం..


నెట్వర్క్ సరిగ్గా రాకపోతే ఒక్కోసారి వీక్ కనెక్షన్ ఉంటే ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాలి. లేదంటే వైఫై మొబైల్ డేటా మధ్య మారండి. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇంటర్నెట్ లేదా కనెక్షన్ క్లిక్ చేయండి.
మీ మొబైల్ ను బట్టి వేర్వేరు ప్లేస్ లో ఉండవచ్చు. అంటే దీని తర్వాత వైఫై ని పూర్తిగా ఆఫ్ చేసి మొబైల్ డాటా ను ఆన్ చేసుకోండి. ఇందులో ఏమైనా తేడాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అయినా మీ సమస్య పరిష్కారం కాకుంటే దీనికి ఆపోజిట్ లో ప్రయత్నం చేయాలి. అంటే ముందుగా మొబైల్ డేటాను ఆఫ్ చేసుకుని, వైఫై ని ఆన్ చేసి, ఏదైనా మార్పు ఉందా లేదా అనేది గమనించండి. అయితే చాలాసార్లు సమస్య అనేది మొబైల్ లో ఉండిపోతూ ఉంటుంది. దీన్ని చూసే చాలామంది నెట్వర్క్ సమస్య అని అనుకుంటారు. –

ఇలాంటి సమయంలో మీ యొక్క సిమ్ ను మరొక మొబైల్ లో వేసి చూడండి. అందులో కూడా నెట్వర్క్ సరిగ్గా లేకుంటే నెట్వర్క్ ప్రాబ్లం అనుకోవచ్చు. అందులో నెట్వర్క్ స్పీడ్ గా ఉంటే మీ ఫోన్ లో సెట్టింగ్స్ ప్రాబ్లం అని గమనించండి. ఒకవేళ మీ ఫోన్లోనే ప్రాబ్లం ఉంటే మొబైల్ సెట్టింగ్స్ కి వెళ్లి అక్కడ వైర్లెస్ మరియు నెట్వర్క్ సెట్టింగ్స్ లపై క్లిక్ చేయండి.

మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ ఆపరేటర్ పై క్లిక్ చేయండి. నెట్వర్క్ ను మాన్యువల్ గా లేదంటే ఆటోమేటిక్ అనే ఆప్షన్ లో ఎంచుకోండి. ఇలా చేసినా కానీ నెట్వర్క్ సరిగ్గా లేకుంటే మీ యొక్క మొబైల్ లేటెస్ట్ ఓఎస్ తో అప్డేట్ అయిందా లేదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకవేళ కాకపోతే మొబైల్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ తో అప్డేట్ చేయండి.