సాధారణంగా బుల్లితెరపై, థియేటర్లలో వచ్చే నిమిషాల యాడ్స్ ద్వారా ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అంతేకాదు.. ప్రకటనల ద్వారా సెలబ్రేటీస్ పెద్ద మొత్తంలో సంపాదిస్తుంటారు. కానీ మీకు తెలుసా. ? మన దేశంలోనే అత్యంత ఖరీదైన యాడ్ ఏదో. కేవలం ప్రమోషన్ కోసమే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ప్రజలను ఆకర్షించడానికి పెద్ద బడ్జెట్, టాప్ సెలబ్రెటీలతో ప్రకటనలు చేస్తుంటారు. తాజాగా డీమ్ 11 ప్రకటనలో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ ప్రకటనకు చేసిన డబ్బు ఖర్చులో పెద్ద సినిమా తీయవచ్చని అంటున్నారు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈ ప్రకటనకు ఎంత డబ్బు ఖర్చు చేశారు? దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ‘డ్రీమ్ 11’ ప్రకటనలో నటులు అమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ తదితరులు ఉన్నారు. ఇంకా, ఆలియా భట్ ఇతరులను దాని ప్రమోషన్ కోసం వచ్చారు. ఈ ప్రకటనను నిర్మించడానికి ఖర్చు చేసిన మొత్తం చూసి అందరూ షాక్ అయ్యారు.
ఆమిర్ ఖాన్ ఒక్కో ప్రకటనకు 10-12 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. రోహిత్ శర్మకు రూ.3.5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఒక్కో ప్రకటన కోసం రిషబ్ పంత్ 1-2 కోట్ల రూపాయలు, రణబీర్ కపూర్ 6 కోట్ల రూపాయలు, హార్దిక్ పాండ్యా 2-3 కోట్ల రూపాయలు. అర్బాజ్ ఖాన్ కు రూ.35 లక్షలు, అశ్విన్ కు రూ.1 కోటి, బుమ్రాకు రూ.2-3 కోట్లు, జాకీ ష్రాఫ్ కు రూ.50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క ప్రకటనలోనే వీళ్లందరూ కనిపించారు. అంటే వీరందరి ప్రకటనల పారితోషికం మొత్తం కలిపితే దాదాపు రూ.35 కోట్ల వరకు అవుతుంది.
ఇక నిర్మాణం, సెట్, దర్శకుడికి, ప్రమోట్ చేయడానికి అలియా భట్ కు.. మొత్తం కలిపితే రూ.50 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బుతో పెద్ద బడ్జెట్ సినిమా నిర్మించవచ్చని అంటున్నారు నెటిజన్స్. మొత్తానికి బడ్జెట్, స్టార్స్ కారణంగా మాత్రం ఈ యాడ్ తెగ వైరలవుతుంది.