‘నరసింహా’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి ‘నీలాంబరి’ క్యారక్టర్ చేస్తున్నది ఎవరంటే

సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాల్లో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Super star Rajinikanth) హీరో గా నటించిన ‘నరసింహా’ (Narasimha Movie).


1999 వ సంవత్సరం లో తమిళం లో ఈ చిత్రం ‘పడియప్పా’ అనే పేరుతో విడుదలైంది. అక్కడ ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో తెలుగు లో ఈ చిత్రాన్ని ‘నరసింహా’పేరుతో దబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పటికే బాషా చిత్రం తో తెలుగు ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న రజినీకాంత్, ‘నరసింహా’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ స్థాయి దక్కింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 12న పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ రీ రిలీజ్ పై తమిళ ఆడియన్స్ లో ఉన్న హైప్ మామూలుది కాదు. కచ్చితంగా ఈ చిత్రం ‘గిల్లీ’ రికార్డుని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు రజినీకాంత్ అభిమానులు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లోనే జరిగాయి. గడిచిన 24 గంటల్లో ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 5 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరి పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మహిళలు థియేటర్స్ గేట్లు బద్దలు కొట్టుకొని మరీ వచ్చి చూసిన చిత్రమిది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేయకపోతే ఎలా?, ఈమధ్య కాలం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. నేను కూడా రోబో సీక్వెల్ చేశాను, ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నాను, ఈ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఈ ఆలోచనలు వచ్చాయి. ఈ సీక్వెల్ కి నీలాంబరి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాం’ అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ సినిమాలో రజినీకాంత్ కంటే ఎక్కువ పేరు విలన్ క్యారక్టర్ చేసిన రమ్య కృష్ణ కి వచ్చింది. ఆమె పోషించిన ‘నీలాంబరి’ పాత్రలో లేడీ విలన్ రోల్స్ కి ఒక ట్రేడ్ మార్క్ లాగా నిల్చింది. ఏ హీరోయిన్ అయినా ఇప్పుడు లేడీ విలన్ క్యారక్టర్ చేస్తే, రమ్య కృష్ణ నీలాంబరి క్యారక్టర్ తో పోల్చి చూస్తున్నారు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సెట్ చేసిన క్యారక్టర్ ఇది. ఈ క్యారక్టర్ కోసం అప్పట్లో ముందుగా ఐశ్వర్యారాయ్ ని సంప్రదించారట. కానీ ఎందుకో ఆమెని ఒప్పుకోలేదు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి వారిని కూడా సంప్రదించామని, చివరికి రమ్యకృష్ణ వద్ద ఆగామని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే నీలాంబరి క్యారక్టర్ ని ఎవరు చేస్తారు?, ఆ రేంజ్ టాలెంట్ ఎవరికీ ఉంది ? అనే ప్రశ్న సోషల్ మీడియా లో రాగా, అత్యధిక శాతం మంది తమన్నా పేరు చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కార్యరూపం దాల్చిన తర్వాత ఎవరు ఆ క్యారక్టర్ చేస్తారో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.