ఐటెల్ ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ సిమ్ సపోర్ట్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో భారత మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్లు, ధర ఎంతంటే?
కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ టెక్ బ్రాండ్ ఐటెల్ స్పెషల్ ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ సిమ్ సపోర్ట్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వచ్చింది. భారత మార్కెట్లో ఇదే ఫస్ట్ ట్రిపుల్ సిమ్ ఫోన్ అవుతుంది.
కీప్యాడ్ ఫోన్ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్ -40°C నుంచి 70°C వరకు ఉష్ణోగ్రత నిరోధకత, 32GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఈ ఐటెల్ కింగ్ సిగ్నల్ ఫోన్ ధర, కలర్ వేరియంట్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఐటెల్ కింగ్ సిగ్నల్ ధర :
ఐటెల్ కింగ్ సిగ్నల్ ఫోన్ ఆర్మీ గ్రీన్, బ్లాక్, పర్పుల్ రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర కేవలం రూ. 1399 మాత్రమే. ఈ కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు భారత్ అంతటా రిటైల్ షాపులలో అందుబాటులో ఉంది.
ఐటెల్ కింగ్ సిగ్నల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐటెల్ కింగ్ సిగ్నల్ ఫోన్ 2-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 33 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ నెట్‌వర్క్ వేగంగా ఉంటుంది.
62శాతం వేగవంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించే సిగ్నల్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఫోటోల కోసం అద్భుతమైన కెమెరాను కూడా కలిగి ఉంది. మీకు ఈ ఫోన్‌లో సూపర్ బిగ్ టార్చ్ కూడా లభిస్తుంది. ఐటెల్ కింగ్ సిగ్నల్ ఫోన్‌లో 3.5mm ఇయర్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది.
కెవ్లార్‌తో నిర్మించిన ఈ ఫోన్ అద్భుత పర్ఫార్మెన్స్ అందిస్తుంది. -40 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వరకు టెంపరేచర్ తట్టుకోగలదు. ఈ ఫోన్ ట్రిపుల్ సిమ్‌కు సపోర్టు ఇస్తుంది. సిగ్నల్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. 62శాతం స్పీడ్ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తుంది.
ఈ ఫోన్ ఆటో కాల్ రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 32GB వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. రికార్డింగ్‌తో వైర్‌లెస్ FM, బ్యాక్ కెమెరాకు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 13 నెలల వారంటీతో పాటు 111 రోజుల ఫ్రీ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీతో వస్తుంది.