తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్

www.mannamweb.com


భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ సెంచరీతో 474 పరుగులు చేసింది. ఇక మూడో రోజు భారత్‌కు రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా జోడీ శుభారంభం అందించినా, ఆట ప్రారంభమైన తొలి గంటలోనే దూకుడు ప్రదర్శించే ప్రయత్నంలో పంత్‌ వ్యక్తిగత స్కోరు 28 వద్ద ఔటయ్యాడు. దీని తర్వాత నాథన్ లియాన్ రవీంద్ర (17) జడేజాపై అవుట్ అయ్యాడు. 7 వికెట్ల పతనం తర్వాత నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అద్భుతాలు చేశారు. రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. దానితో పాటు టీమిండియా ఫాలో ఆన్‌ను తప్పించుకోగలిగింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ 69 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 34 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్లో తన మొదటి హాఫ్ సెంచరీ అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి పుష్ప స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తన బ్యాట్ తో తగ్గేదేలే అన్నట్లుగా సింబాలిక్ గా చూపిస్తూ తన దూకుడుతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.